వాజ్‌పేయికి ఇష్టమైన నటి ఎవరో మీకు తెలుసా?

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బీజేపీ దిగ్గజ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం యావత్ దేశం.. ఆయన త్వరలో కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. భారత దేశ ప్రధాని సహా పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

Last Updated : Aug 16, 2018, 10:01 PM IST
వాజ్‌పేయికి ఇష్టమైన నటి ఎవరో మీకు తెలుసా?

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న బీజేపీ దిగ్గజ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి కోసం యావత్ దేశం.. ఆయన త్వరలో కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. భారత దేశ ప్రధాని సహా పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తున్నారు.

వాజ్‌పేయి రాజకీయ నేతగానే అందరికీ తెలుసు. కానీ ఆయనో కవి అని.. ఆయనకు కళలు, సినిమాలు అంటే ఇష్టమని అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. కవితలు రాయడం, చదవడంతో పాటు ఆయన సినిమాలు కూడా చూస్తారు. ఆయనకు ఇష్టమైన నటి ఎవరో మీకు తెలుసా?

అటల్ బిహారీ వాజ్‌పేయి హేమామాలిని అభిమానట. 1972లో సీతా ఔర్ గీతా అనే చిత్రాన్ని వాజ్‌పేయి 25 సార్లు చూశారట. ఈ విషయాన్ని స్వయానా బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమామాలినే చెప్పారు. గత ఏడాది మథురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాజీ ప్రధాని అటల్ గురించి మాట్లాడారు.

ఈ సమయంలోనే హేమామాలిని అప్పటి విషయాలను గుర్తుచేశారు. నేను వాజ్‌పేయిని కలవాలని చాలా సార్లు అనుకున్నా. అయితే అనుకోకుండా ఆయన్ను కలవడానికి అవకాశం వచ్చింది. ఆయన్ను కలవడానికి వెళ్లాను. అయితే ఆయన నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారని నేను భావించి.. అక్కడున్న మహిళను అడిగితే.. అసలు విషయం అప్పుడు అర్థమైంది. 1972లో సీతా ఔర్ గీతా 25 సార్లు చూశారని.. హఠాత్తుగా ఎదురుగా కనిపిస్తే మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారని ఆమె చెప్తే నేను ఆశ్చర్యపోయానని హేమామాలిని చెప్పారు.

 

వాజ్‌పేయి రాసిన అనేక పద్యాలు నయి దిశ అనే ఆల్బమ్‌గా మార్చబడ్డాయి. ఈ పాటలను జగిత్ సింగ్, ఆల్కా యాగ్నిక్ పాడారు.

వాజపేయికి.. బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ మిత్రుడు. 1999లో ఇద్దరూ కలిసి పాకిస్థాన్‌కు వెళ్లారు. దేవానంద్ పుట్టిన ఊరు లాహోర్‌ను సందర్శించారు.

అటల్ బీహారీ వాజ్‌పేయి 93వ జన్మదినం సందర్భంగా.. ఆయన జీవిత కథ ఆధారంగా 'యుగ్‌పురుష్ అటల్ ' అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు డైరెక్టర్ మయాంక్ పి.శ్రీవాత్సవ. ఈ సినిమాకు బసంత్ కుమార్ స్టోరీ రైటర్.

మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'లో రాం అవాతార్ భరద్వాజ్ వాజ్‌పేయి పాత్ర పోషిస్తున్నారు.

'పర్‌మను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్' అనే చిత్రంలో వాజ్‌పేయి గురించి ప్రస్తావించారు.

Trending News