మాజీ ప్రధాని, భారత రత్న అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ్‌పేయి (93) ఇక లేరు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం 05:05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆస్పత్రివర్గాలు తాజాగా ఆఖరి హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. జూన్ 11న ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి ఆరోగ్యం గత 9 వారాలుగా స్థిమితంగానే ఉంటూ వచ్చినప్పటికీ గడిచిన 36 గంటల్లో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు ఎయిమ్స్ వర్గాలు ఈ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నాయి. మాజీ ప్రధానిని రక్షించుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని ఎయిమ్స్ వర్గాలు ఆవేదన వ్యక్తంచేశాయి.
Former Prime Minister & Bharat Ratna #AtalBihariVaajpayee passes away in AIIMS. He was 93. pic.twitter.com/r12aIPF5G0
— ANI (@ANI) August 16, 2018