తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ఉపాధ్యక్షురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ (65) (Ex MLA Satyaprabha) కన్నుమూశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న సత్యప్రభ.. అనారోగ్యంతో బెంగళూరు (bengaluru) లోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.
ఏపీ లాసెట్ (AP LAWCET 2020) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రేపటి నుంచి బడి గంటలు మోగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షించేలా ప్రభుత్వం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు (AP Formation Day) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో (నవంబర్ 1) 64 ఏళ్లు నిండాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (road accident) సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి కింద పడటంతో.. ఏడుగురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో మద్యం ధరలు అధికంగా ఉండటంతో.. మద్యం ప్రియులు సరిహద్దుకు దగ్గరగా ఉన్న వేరే రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీంతోపాటు దళారి వ్యాపారులు సైతం వేరే రాష్ట్రాల నుంచి భారీగా మద్యం బాటిళ్ల ( Illicit Liquor ) ను అక్రమంగా ఏపీకి తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి మందుబాబులకు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) గ్రామ సచివాలం పరీక్షలు 2020 ఫలితాలు సెప్టెంబర్ 20 నుంచి 26 మధ్యలో జరిగాయి. వాటి ఫలితాలను అక్టోబర్ చివరి నాటికి విడుదల చేయనున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections) నిర్వహణపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి (Mekapati Goutham Reddy)గౌతమ్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోసారి కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణుల నుంచి హెచ్చరికలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో నవంబరులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమేనని మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
ఏపీలో ఇంటర్ ప్రవేశాలకు 2020-21 విద్యా సంత్సరానికిగానూ తొలిసారిగా ఆన్లైన్ విధానం (AP Inter Online Admission 2020-21) వినియోగిస్తున్నారు. అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. ఈ రోజుల్లో ఎంతో నిష్టతో ఉపావాసాలుంటూ.. దుర్గాదేవికి విశేష పూజలు చేస్తూ.. అమ్మవారి ప్రసన్నం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ అత్యంత భక్తిపారవశ్యంతో పులకించిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో వంటి నగరాల్లోని ఆలయాలతో పాటు జమ్మూకాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇంద్రకీలాద్రీపై వెలసిన కనదుర్గమ్మ ఆలయాల్లో 9రోజుల పాటు జరిగే శరన్నవరాత్రి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.