Navratri 2020 Day 2: Worship Devi Brahmacharini for virtue and peace: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు మాత దుర్గాదేవిని రోజుకో అవతారంలో భక్తులు కొలుస్తారు. ఈ రోజుల్లో ఎంతో నిష్టతో ఉపావాసాలుంటూ.. దుర్గాదేవికి విశేష పూజలు చేస్తూ.. అమ్మవారి ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండోరోజు శనివారం అమ్మవారు బ్రహ్మచారిణి (Devi Brahmacharini) (బాలా త్రిపురసుందరి దేవి) దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. రెండోరోజు బ్రహ్మచారిణీ దుర్గా దేవి ( Bala Tripurasundari Avataram) లేత గులాబీ రంగు చీర దాల్చి, కుడి చేతిలో జప మాల, ఎడమ చేతిలో కమండలం ధరించి భక్తులకు దర్శనమివ్వనుంది త్రిపురుని భార్య. త్రిపురసుందరి అనగా ఈశ్వరుని భార్య గౌరీదేవియే ఈ బాలాత్రిపుర సుందరి. Also read: Navratri 2020: అమ్మవారికి ఏ రోజు ఎలాంటి పూజలు జరగాలి ? ఘటస్తాపన ముహూర్తాలు ఏంటి ?
మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ బాలాదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్తముద్రతో అక్షమాలను ధరించిన ఈ అమ్మవారు త్రిపురాత్రయంలో మొదటి దేవతగా విరాజల్లుతూ.. భక్తుల కోరికలు తీర్చే బాలాదేవీగా విశేష పూజలందుకుంటుంది. కావున బాలా త్రిపురసుందరి దేవిని నిశ్చలమైన మనస్సుతో ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోయి.. నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల్లో అపార విశ్వాసం. దీంతోపాటు భక్తులు సత్సంతానం కోసం.. శాంతి, ధర్మం, శ్రేయస్సు కోసం బాలా త్రిపురసుందరి దేవిని కొలుస్తారు. ఈ రోజు రెండునుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా ఆరాధించి అమ్మవారికి పాయసం (కట్టుపొంగలి) ను నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రీ అమ్మవారి శ్లోకం..
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం
ALSO READ| Krishna : శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 7 జీవిత పాఠాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe