US Election 2020: AP CM YS Jagan wishes Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US election 2020) డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ (Kamala Harris) ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళా నాయకురాలిగా నిలిచి.. గతంలో ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. అత్యున్నత స్థాయి పదవికి ఎన్నికైన కమలా హారిస్‌కు ప్రపంచం నలుదిక్కుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Democrats or Republicans, politics apart, we are happy and proud to have in @KamalaHarris someone of Indian origin as the Vice President of America.
Congratulations and best wishes. May God bless you and guide you.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2020
అయితే అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (andhra pradesh cm ys jagan mohan reddy) కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆదివారం ట్విట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్లో ఇలా రాశారు.. డెమొక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ, రాజకీయాల సంగతి పక్కన పెడితే.. భారత మూలాలు కలిగిన కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉంది.. కమలా హారిస్‌కు శుభాకాంక్షలు.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా.. అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. Also read: US Elections: జో బిడెన్, కమలా హారిస్‌కు.. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
Also read: Haj 2021: హజ్ యాత్రకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe