Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు.

Last Updated : Oct 20, 2020, 11:49 AM IST
Navratri Day 4: అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

Navratri 2020 day 4: Worship Goddess Kushmanda for strength: దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాలయాల్లో రోజుకో రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తులు నిత్యం ఉపవాసాలుంటూ నిష్టగా పూజలు చేస్తున్నారు. అయితే దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం కనకదుర్గా అమ్మవారు.. ‘శ్రీ కూష్మాండ దుర్గా’ (అన్నపూర్ణా దేవీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ తల్లిని అష్టభుజాదేవీ (Kushmanda Devi) అని కూడా పిలుస్తారు. అన్నపూర్ణా దేవి ( annapurna devi avataram) అమ్మవారు కాషాయం లేదా.. బంగారం రంగు చీర ధరించి అష్టభుజాలతో సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. కుడివైపు చేతుల్లో పద్మం, బాణం, ధనుస్సు, కమండలం, ఎడమ వైపు చేతుల్లో చక్రం, గద, జపమాల, అమృత కలశాన్ని ధరించి ఆమె భక్తులను కరుణిస్తుంది. అందుకే ఈ తల్లిని పూజిస్తే ఆయురారోగ్యాలతోపాటు అష్టఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల్లో అపార నమ్మకం. Also read: Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు

annapurna-devi

సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం.. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందుకే ఈ తల్లిని సృష్టి పోషకరాలి రూపంలో కొలుస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికి భిక్షపెట్టిన అమ్మ అన్నపూర్ణాదేవి. కావున ఈ తల్లిని స్మరించుకోవడం వల్ల మేధాశక్తి వృద్ధిచెందడంతోపాటు మధుర భాషణం, సమయస్ఫూర్తి, బుద్ధి, వాక్ సిద్ధి, ఐశ్వర్యం, సంపద ప్రాసాదిస్తుందని భక్తుల్లో విశ్వాసం. కావున ఈ రోజు భక్తులు పరిపూర్ణ భక్తితో పూజించి.. అన్నపూర్ణా అమ్మవారికి కేసరి, కొబ్బరి అన్నంను నైవేద్యంగా సమర్పిస్తారు.  

అమ్మవారి అనుగ్రహం కోసం ఈ శ్లోకం పఠించండి..

ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ

నారీ నీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ

సాక్షాన్‌ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ

భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఇదిలాఉంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనదుర్గా దేవీ అమ్మవారు ఈరోజు అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం నుంచే భక్తులు కనకదుర్గా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కరోనా నిబంధనల మేరకు దేవస్థానం భక్తులను పరిమిత సంఖ్యలో ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తోంది. ALSO: Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News