MLA Vallabhaneni Vamsi tested for Covid-19 positive: అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరో ఎమ్మెల్యే సైతం కరోనా బారిన పడ్డారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. Also read: MP Bypolls: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
గత కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తున్నఎమ్మెల్యే వంశీ ఇటీవలె శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన శనివారం కరోనా పరీక్షలు చేయించుకోగా (MLA Vamsi Vallabhaneni tested for Covid-19 positive) పాజిటివ్‌గా తేలినట్లు ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు వంశీ 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతారని తెలిపారు. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ
ఇదిలాఉంటే.. గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ప్రస్తుతం అధికార పార్టీ వైఎస్‌ఆర్ సీపీకి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే వంశీ అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. అధికారపార్టీ వెన్నంటే ఉంటున్నారు.
Also read: Tejashwi Yadav: సీఎం అభ్యర్థికి చేదు అనుభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe