Navratri Day 6: లలిత త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.

Last Updated : Oct 22, 2020, 11:36 AM IST
Navratri Day 6: లలిత త్రిపురసుందరి దేవిగా అమ్మవారి దర్శనం

Navratri 2020 day 6: Pray to Maa Katyayani for married life: న్యూఢిల్లీ: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020)దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది. ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు కాత్యాయుని కుమార్తె కాత్యాయని దేవీ (లలిత త్రిపుర సుందరి దేవీ) బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి నాలుగు భుజములతో సింహవాహనిగా దర్శనమిస్తుంది. చెరుకు గడ, పూలను చేతబూని అభయ మరియు వరముద్రలతో (Kanaka durga) అమ్మవారు భక్తులకు కరుణించనుంది. Also read: Navratri 2020: నవరాత్రి సమయంలో తీసుకోవాల్సిన 5 సాత్విక పానీయాలు

సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన ఆది పరాశక్తి లలిత త్రిపుర సుందరి అమ్మవారిని భక్తులు మహామంత్ర అధిష్టాన దేవతగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారిని పూజిస్తే.. ఇంట్లో శాంతి, శ్రేయస్సు కలుగుతాయని అపార నమ్మకం. అమ్మవారిని పూజించడం వల్ల వివాహానికి సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయి. పెళ్లి కాని వారికి లలిత త్రిపుర సుందరీ కటాక్షంతో వివాహ భాగ్యం తొందరగా ప్రసన్నమవుతుంది. దీంతోపాటు భయం, దు:ఖం, దారిద్ర్యం, మంగళ దోషాలు తొలిగిపోవడం కోసం భక్తులు ఉపవాసంతో నిష్టంగా
పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కొబ్బరి అన్నం, గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 

అమ్మవారి అనుగ్రహానికి పఠించవలసిన శ్లోకం.. 
‘‘ ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం ప్ఱుథులమౌక్తికశోభినాసం

ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం 
మందస్మితం మ్ఱుగమదోజ్జ్వలఫాలదేశం ’’

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకునేందుకు విజయవాడ కనక దుర్గా ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. లలితా త్రిపుర సుందరి అవతారం దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు.  Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News