Jagananna Vidya Deevena Scheme, Jagananna Vasathi Deevena Scheme: జనవరి - మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను మే 24న.. అంటే రేపే తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
'జగనన్న విద్యా దీవెన'
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో తమ ప్రభుత్వం నేరుగా జమ చేయడం జరుగుతోంది అని ఏపీ సర్కారు స్పష్టంచేసింది.
'జగనన్న వసతి దీవెన'
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం.. కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదివితే అంత మందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్నామని ఏపీ సర్కారు వెల్లడించింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10,636.67 కోట్ల ఆర్థిక సాయం జమ చేసినట్టు ఏపీ సర్కారు తేల్చిచెప్పింది.
గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టగా.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2017 సం॥ నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన పథకం, జగనన్న వసతి దీవెన పథకం కింద ఇప్పటి వరకు రూ. 14,912.43 కోట్లు విడుదల చేసినట్టు జగన్ సర్కారు ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు గడిచిన ఈ 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన అక్షరాల రూ.59,331.22 కోట్లు ఖర్చు చేసినట్టు ఏపీ ప్రభుత్వం తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి : Rs 2,000 Notes News: బాగా డబ్బున్నోళ్లు 2 వేల నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా ?
డిజిటల్ విద్య దిశగా అడుగులు..
8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్‌లు.. నాడు - నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్ లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.. ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు, కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇది కూడా చదవండి : Tata Altroz CNG Car: అద్దిరిపోయే అడ్వాన్స్డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK