AP secretariat shifting to Vizag : విశాఖపట్నంకు రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారైందా ?

ఆంధ్ర ప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. త్వరలోనే ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంకు సచివాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏపీ సచివాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం.

Last Updated : Mar 3, 2020, 08:37 PM IST
AP secretariat shifting to Vizag : విశాఖపట్నంకు రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారైందా ?

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌కి మూడు రాజధానుల ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేస్తూ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్.. త్వరలోనే ఏపీ ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ విశాఖపట్నంకు సచివాలయాన్ని తరలించేందుకు (AP secretariat shifting) ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏపీ సచివాలయాన్ని వైజాగ్‌కు తరలించాలని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. అంటే మే నెల లోపుగా ఈ అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకుని మే నెల్లో సచివాలయాన్ని వైజాగ్‌కు తరలింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే సచివాలయం ఉద్యోగులు మే నెల్లో షిఫ్టింగ్‌కి రెడీగా ఉండాలని ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, సచివాలయ తరలింపు, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు సచివాలయం ఉద్యోగులు వచ్చే వారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సచివాలయం తరలింపు అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సమావేశం ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. 

ఏపీకి మూడు రాజధానులు అవసరం అని భావించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అమరావతిని (Amaravati) లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా, విశాఖపట్నంను (Visakhapatnam) ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా, కర్నూలును (Kurnool) జ్యుడిషియరి క్యాపిటల్‌గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లును జనవరి 20న ఏపీ అసెంబ్లీ సైతం ఆమోదించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News