Janasena party meeting : కీలక అంశాలపై చర్చించేందుకు జనసేన విస్తృత స్థాయి సమావేశం

జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాలకు చెందిన నాయకులతో ఈ నెల 30న మంగళవారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలియజేశారు. ఈ మేరకు పార్టీ సైతం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Last Updated : Dec 26, 2019, 07:15 PM IST
Janasena party meeting : కీలక అంశాలపై చర్చించేందుకు జనసేన విస్తృత స్థాయి సమావేశం

విజయవాడ: జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాలకు చెందిన నాయకులతో ఈ నెల 30న మంగళవారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలియజేశారు. ఈ మేరకు పార్టీ సైతం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, మూడు రాజధానుల వివాదం, అమరావతి గ్రామాల ప్రజలు, రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు-ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత వంటి అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. ఆయా అంశాలపై జనసేన పార్టీ వైఖరి, పార్టీ పరమైన నిర్ణయాలు, అనంతరం నిర్వహించాల్సిన కార్యక్రమాలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారని పార్టీ ప్రకటించింది. 

Read also : రాజధాని మూడు ముక్కలాట వెనుక వైసిపి ఇన్‌సైడ్ ట్రేడింగ్: జనసేన

జనసేన పార్టీ పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live link here..

Trending News