3 capitals for AP | అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే: ఏపీఎస్ ఆరోపణలు

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు.

Last Updated : Dec 24, 2019, 08:44 PM IST
3 capitals for AP | అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే: ఏపీఎస్ ఆరోపణలు

అమరావతి పరిరక్షణ సమితి (APS) ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌పై, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీఎస్ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఈ భేటీలో విద్యావంతుల కమిటి అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ.. విశాఖలో ఏర్పాటు చేయబోయేది రాజధాని కాదని.. అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీఎం కావడానికి ముందురోజు నుంచే అమరావతిని స్లో పాయిజన్ ఇచ్చి చంపడం ప్రారంభించారు. గేట్లెత్తితే పోయే నీళ్లను ఆపేసి ప్రతిపక్షనేత ఇంటిమీదకు నీళ్లు మళ్లించి అమరావతిని ముంపు ప్రాంతంగా చూపాలని చూశారు. అప్పటినుంచే సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan Mohan Reddy) విశాఖలో తన ఏర్పాట్లలో తాను ఉన్నారని దుయ్యబట్టారు. వేల ఎకరాలు తనవాళ్లతో కలిసి ఆక్రమించిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రస్తుతం ఏ వ్యవస్థను లెక్కచేసే పరిస్థితిలో లేరని మండిపడ్డారు. 

Read also : జగన్‌కి జై కొట్టి.. పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు.. '' విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎరైనా దక్షిణాఫ్రికాకు ఉన్న మూడు రాజధానుల ఉదాహరణ (Three capital cities) ఆంధ్రప్రదేశ్‌కి చూపిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగపూర్, అమెరికా, జపాన్ సరసన ఏపిని నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపిని ఇథియోపియాతో, సోమాలియాతో, సౌతాఫ్రికా సరసన నిలబెడుతున్నారని మండిపడ్డారు. 

Read also : త్వరలోనే ఏపీలో 25 జిల్లాలు ఏర్పాటు!!

ఇదిలావుంటే, మరోవైపు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆధ్వర్యంలో పలువురు ఆందోళనకారులు ఇవాళ ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు నివాసాన్ని ముట్టిడించి నిరసన వ్యక్తంచేశారు. సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి నివాసం ఎదుట బైఠాయించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here

Trending News