'కరోనా'హెల్మెట్‌తో అవగాహన

మీ కోసమే చెబుతున్నాం.. మీ మంచి కోసమే చెబుతున్నాం.. అని ఎంత చెప్పినా.. జనం మాత్రం పట్టించుకోవడం లేదు.  దీంతో  పోలీసులకు లాఠీ ఝుళిపించాల్సిన బాధ  తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో  పోలీసులకు పౌరులకు మధ్య ఈ విషయం గురించి ఓ యుద్ధమే జరుగుతోంది.

Last Updated : Mar 28, 2020, 03:22 PM IST
'కరోనా'హెల్మెట్‌తో అవగాహన

మీ కోసమే చెబుతున్నాం.. మీ మంచి కోసమే చెబుతున్నాం.. అని ఎంత చెప్పినా.. జనం మాత్రం పట్టించుకోవడం లేదు.  దీంతో  పోలీసులకు లాఠీ ఝుళిపించాల్సిన బాధ  తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో  పోలీసులకు పౌరులకు మధ్య ఈ విషయం గురించి ఓ యుద్ధమే జరుగుతోంది.

నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే లాక్ డౌన్ తప్పనిసరి. అంటే ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఆఫీసులు లేవు కదా.. వ్యాపారాలు లేవు కదా.. అని రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. దీంతో అనుకున్న లక్ష్యం పూర్తి కాదు. కాబట్టి వారికి తిరిగి ఇళ్లకు పంపేందుకు పోలీసులు  చేయని ప్రయత్నం అంటూ లేకుండా పోయింది.  లాక్ డౌన్ తొలి రోజు పూలు ఇచ్చి ఇళ్లకు తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత దండం పెట్టి చెప్పారు. వినని వారిపై  లాఠీ  ఝుళిపించారు.

బీహార్‌లో బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ..!!

ఇప్పుడు తమిళనాడులో పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు.  రోడ్లపైకి వచ్చిన వారిని ఇళ్లకు తిరిగి పంపేందుకు ఏకంగా ఓ "కరోనా వైరస్"లా కనిపించే హెల్మెట్ తయారు  చేశారు. దాన్ని వేసుకుని రోడ్డుపై కనిపించిన వాహనదారులను ఆపి భయపెడుతున్నారు. మీరు ఇళ్లకు వెళ్లనిపక్షంలో  కరోనా బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏ కారణం లేకుండా వాహనాలపై ఇద్దరు ముగ్గురు తిరిగే వారిని అడ్డుకుంటున్నారు  పోలీసులు. చెన్నైలో ఈ దృశ్యం కనిపించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News