రేపు సీఎంలతో మోదీ వీడీయో కాన్ఫరెన్స్

దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ విస్తృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.

Last Updated : Apr 1, 2020, 03:59 PM IST
రేపు సీఎంలతో మోదీ వీడీయో కాన్ఫరెన్స్

దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ విస్తృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. సామాజిక దూరం పాటిస్తున్నా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ విస్తృతి ... దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై రేపు ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని  ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. కానీ లాక్ డౌన్ ఉన్న దృష్ట్యా వీలుపడే పరిస్థితి లేదు. కాబట్టి.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  మాట్లాడనున్నారు. 

దిగొచ్చిన గ్యాస్ బండ ధర

వివిధ  రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తితోపాటు .. లాక్ డౌన్ అమలు తీరును ... భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై వారితో విస్తృతంగా ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. రేపటి ముఖ్యమంత్రులు, ప్రధాని మోదీ సమావేశంలో  లాక్ డౌన్ పొడగింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News