'కరోనా వైరస్'.. ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని గడగడా వణికిస్తోంది. ఓ వైపు ఈ వైరస్ మృత్యుక్రీడ ఆడుతుంటే.. మరోవైపు దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాకు వ్యాక్సిన కనుగొనేందుకు ప్రపంచ దేశాల్లోని పరిశోధకులు కృషి చేస్తున్నారు. అలాగే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపైనా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో 'కరోనా వైరస్' మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది.
చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి.. విజృంభిస్తున్న 'కరోనా వైరస్' అగ్రరాజ్యం అమెరికాను సైతం గజగజా వణికిస్తోంది. ఇప్పుడు అమెరికాలో దీనిపై పరిశోధనలు ఎక్కువయ్యాయి. పరిశోధన చేస్తున్న వారికి కొత్త కొత్త భయంకరమైన నిజాలు తెలుస్తున్నాయి. మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపించే ఈ వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. కరోనా వైరస్ పై పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు.. ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవును... ఈ వైరస్ గాలిలో కూడా కొద్ది గంటలు జీవించి ఉన్నట్లు అమెరికా
పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది.
కరోనా ఎఫెక్ట్: ఏపీలో జీతాలు వాయిదా
'కరోనా వైరస్'పై అమెరికాలోని నెబ్రాస్కా యూనివర్శిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. 'కరోనా వైరస్' పాజిటివ్ రోగులకు చికిత్స పొందిన ఆస్పత్రి కారిడార్లలో .. వారు వాడిన దుస్తుల్లో .. వారు ఉపయోగించిన గదుల్లో వైరస్ కొద్ది గంటలపాటు జీవించే ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఆస్పత్రిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
'కరోనా'పై కీరవాణి పాట
కరోనా వైరస్ పాజిటివ్ రోగులు ఉపయోగించిన టాయిలెట్ల ఉపరితలంపై కరోనా వైరస్ కొద్ది గంటలు బతికే ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఆస్పత్రి గోడలు.. ఇతర ప్రాంతాల ఉపరితలంపైన ఎవరైనా ముట్టుకుని ముఖంపై ముట్టుకుంటే వైరస్ వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. మెటల్, ప్లాస్టిక్ వస్తువుల ఉపరితలంపై కరోనా వైరస్ 72 గంటలపాటు జీవించే ఉంటుదనే భయంకరమైన నిజం వెల్లడంచారు. దీంతో అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..