అమెరికాలోని కాలిఫోర్నియాలో వింత కేసు నమోదైంది. ఓ మహిళను కాలిఫోర్నియా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి కారణం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ ఆ మహిళ చేసిన నేరమేంటో తెలుసా..?
'కరోనా వైరస్'... అగ్రరాజ్యం అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో చైనా, ఇటలీ రికార్డులను అమెరికా బద్దలు కొట్టి వేగంగా దూసుకుపోతోంది. దీంతో అమెరికాలో కరోనా భయం విపరీతంగా నెలకొంది. అక్కడక్కడా తెరిచి ఉంచిన సూపర్ మార్కెట్లు వినియోగదారులకు నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలచుకుని ఓ మహిళ రెచ్చిపోయింది.
కాలిఫోర్నియాలోని సేఫ్ వే అనే సూపర్ మార్కెట్ లోకి జెన్నీఫర్ వాకర్ అనే మహిళ సరుకులు కొనేందుకు వచ్చింది. కానీ ఆమె ఉద్దేశ్యం మాత్రం సరుకులు కొనుగోలు చేయడం కాదు. అందుకే ఆమె సూపర్ మార్కెట్లో దాదాపు 1800 డాలర్ల వస్తువులు తీసుకుని ట్రాలీలో వేసుకుంది. ఆ సరుకులు అన్నిటినీ నాలికతో నాకుతూ ట్రాలీలో వేసింది. దీన్ని గమనించి సేఫ్ వే సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన సౌత్ లేక్ టాహ్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె వయసు దాదాపు 53 ఏళ్లు ఉంటాయని గుర్తించారు.
ప్రస్తుతం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఇలా చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆమె నాలికతో నాకిన వస్తువులను అన్నింటినీ సేఫ్ వే సూపర్ మార్కెట్ సిబ్బంది ధ్వంసం చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..