'కరోనా వైరస్' మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించారు. అన్ని దేశాల కంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ .. మన దేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
21 రోజుల లాక్ డౌన్ రేపటితో (బుధవారం) ముగియనుంది. ఇప్పటికీ కరోనా వైరస్ ఇంకా లొంగి రాలేదు. పైగా రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య గుబులు రేకెత్తిస్తోంది. కాబట్టి .. రెండు రోజుల క్రితం జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో .. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీని లాక్ డౌన్ కొనసాగించాలని కోరారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ప్రధాని కూడా .. కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తుందని వారికి హామీ ఇచ్చారు.
మరోవైపు తెలంగాణ, ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్ , మహారాష్ట్ర రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరో 15 రోజులపాటు పొడగించాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. ఈ క్రమంలో కేంద్రం కూడా లాక్ డౌన్ కొనసాగిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో రేపు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో లాక్ డౌన్ కొనసాగింపుపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Prime Minister @narendramodi will address the nation at 10 AM on 14th April 2020.
— PMO India (@PMOIndia) April 13, 2020
లాక్ డౌన్ పొడగింపుతోపాటు ఇంకా ఎలాంటి అంశాలపై ప్రధాని మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో దేశ ప్రజలు అంతా ఆయన ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
రేపు లాక్ డౌన్ పొడగింపుపై స్పష్టత