ఇదిగో చూడండి.. సరికొత్త రామాయణం. .!!

'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్  డౌన్ విధించారు. దీంతో జనాన్ని ఇళ్లలోనే ఉంచడానికి  కేంద్ర ప్రభుత్వం 32 ఏళ్లనాటి  రామయణ, మహాభారత టీవీ సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తోంది.

Last Updated : Mar 28, 2020, 12:19 PM IST
ఇదిగో చూడండి.. సరికొత్త రామాయణం. .!!

'కరోనా వైరస్' కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్  డౌన్ విధించారు. దీంతో జనాన్ని ఇళ్లలోనే ఉంచడానికి  కేంద్ర ప్రభుత్వం 32 ఏళ్లనాటి  రామయణ, మహాభారత టీవీ సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తోంది.

ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి  ప్రకాష్ జవదేకర్  రామాయణ, మహాభారత టీవీ సీరియళ్లను తిరిగి ప్రసారం చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు. ఇవాళ్టి నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి రాత్రి 9  గంటల నుంచి 10  గంటల వరకు ప్రసారం అవుతున్నాయి. 90వ దశకంలో ఈ మెగా టీవీ సీరియళ్లు.. దూరదర్శన్ లో  ప్రసారమై.. విపరీతమైన జనాదరణ పొందాయి. 

మరోవైపు ఈ రోజు(శనివారం) ఉదయం ప్రకాష్ జవదేకర్ కూడా రామాయణం టీవీ సీరియల్ చూస్తూ ఉన్న ఫోటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. 

మరోవైపు నెటిజనులు రామాయణ, మహాభారత టీవీ సీరియల్స్ ప్రసారం చేయడంపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను ట్రోల్ చేస్తున్నారు. రోడ్లపై తమకు వేరే ఇతర దృశ్యాలు కనిపిస్తున్నాయని ట్వీట్ చేస్తున్నారు. ఇదిగో చూడండి.. మాకు రోడ్ల మీద కనిపిస్తున్న 'రామాయణం' అంటూ ట్వీట్ చేస్తున్నారు.

 

ఓ బాటసారి.. ఇది జీవిత రహదారి..!!

మరికొంత మంది నెటిజనులు కార్టూన్ లు కూడా వాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నెటిజనుల దెబ్బకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తన ట్వీట్ ను తొలగించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News