చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు నగరాల్లో హల్చల్ చేస్తున్నాయని వాట్సాప్లో ఫేక్ మెసేజ్లు సర్క్యులేట్ చేస్తూ.. జనాలను భయాందోళనలకు గురిచేస్తున్న వ్యక్తుల పై ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా అన్ని రాష్ట్రాల పోలీసులనూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో దీవుల పరిరక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించే ఐలాండ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ పనితీరును ఈ రోజు సమీక్షించారు. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ లాంటి దీవుల్లో పర్యాటక అభివృద్ది గురించి మాట్లాడారు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి నిజంగానే ధైర్యముంటే ఈ సారి ఎన్నికల్లో హైదరాబాద్ నుండి పోటీ చేయాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్హదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.
డీఎంకే నేత ఎంకే స్టాలిన్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నరేంద్ర మోదీ ఏ దేశాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలకుడిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడిచిన తరుణంలో బీజేపీ యంత్రాంగం సంబరాలు జరుపుకుంటుంటే.. ప్రతిపక్షం కాంగ్రెస్ ఆగ్రహ జ్వాలలు వెలగ్రక్కుతోంది.
‘నమామీ గంగె’ పేరుతో గంగా నదీ ప్రక్షాళనకై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి భారత రాష్ట్రపతితో ప్రధాని మోదీ కూడా తమవంతు సహాయంగా వారి నెలజీతాన్ని విరాళంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వారికి లేఖ రాశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టు నుండి నేపాల్ బయలుదేరారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నేపాల్లోని పలు ప్రాంతాలు సందర్శించనున్నారు.
కర్ణాటకలో తన రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పాలకులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రోజు రోజుకీ అవినీతిమయం అవుతుందని తెలిపారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, భారత ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. "మోదీగారు..! కర్ణాటకలో మీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప సాధించిన విజయాలేమిటో 15 నిముషాలు మాట్లాడండి. పేపర్ చూసి మాట్లాడినా చాలు.." అని ఛాలెంజ్ చేశారు.
ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
నిన్న సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు మెకానికల్ ఇంజనీర్లు కాకుండా సివిల్ ఇంజనీర్లు మాత్రమే దరఖాస్తు చేయాలని, ప్రాజెక్టుల అనుభవం ఉండడం వల్ల వారే ఈ పోస్టులకు మరింత అర్హులని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.