e-auction of PM Modi's gifts: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో (javelin throw) అథ్లెట్ నీరజ్ చోప్రా (neeraj chopra) ఉపయోగించిన ఈటె రూ.కోటిన్నర ధర పలికింది. టోక్యో ఒలింపిక్స్, (tokyo olympics) పారాలింపిక్స్‌లో భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధానికి గిఫ్ట్స్ గా వచ్చిన క్రీడా పరికరాలను ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్లైన్ వేదికగా వేలం వేశారు.
Namami Gange : గత కొద్ది ఏళ్లుగా తనకు ఎందరో ఎన్నో కానుకలు ఇచ్చారన్నారు మోదీ. మన ఒలింపిక్ హీరోలు ఇచ్చిన ప్రత్యేక మెమొంటోలు, వారు ఉపయోగించిన వస్తువులు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. ఈ–వేలంలో వచ్చిన డబ్బునంతా గంగానది శుద్ధి చేయడానికే వినియోగిస్తామని ప్రధాని పేర్కొన్నారు.
‘నమామీ గంగె’ పేరుతో గంగా నదీ ప్రక్షాళనకై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమానికి భారత రాష్ట్రపతితో ప్రధాని మోదీ కూడా తమవంతు సహాయంగా వారి నెలజీతాన్ని విరాళంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వారికి లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.