'మా' నుంచి బాలకృష్ణను సస్పెండ్ చేయాలి: బీజేపీ

బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి సస్పెండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర సినిమా సెల్‌ డిమాండ్‌ చేసింది.

Last Updated : Apr 30, 2018, 02:30 PM IST
'మా' నుంచి బాలకృష్ణను సస్పెండ్ చేయాలి: బీజేపీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నుంచి సస్పెండ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర సినిమా సెల్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సెల్‌ కన్వీనర్‌ సీవీఎల్‌ నరసింహారావు వెల్లడించారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు బకాయిపడ్డ మొత్తాన్ని చెల్లించేలా ఎన్టీఆర్‌ స్టూడియోను ఆదేశించాలని, చెల్లించని పక్షంలో దాన్ని జప్తు చేయాలని పేర్కొన్నారు.

Trending News