ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన మరణించిన వార్తను ఉత్తర కొరియా ప్రపంచానికి తెలియనివ్వడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు ఇటీవల హార్ట్ సర్జరీ చేశారని, అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉందని కథనాలు (Donald Trump On Kim Jong Un Health Condition) వస్తున్నాయి.
పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ సరికొత్త న్యూక్లియర్ ఆయుధాలకు రూపకల్పన చేయాలని చూస్తుందని.. అదే గనుక జరిగితే ఆ దేశ సరిహద్దు ప్రాంతాలకు తీవ్రమైన ముప్పు సంభవించే అవకాశముందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
అమెరికాతో శత్రుత్వాన్ని రోజు రోజుకి పెంచి పోషించుకుంటున్న ఉత్తర కొరియా నేత కిమ్, తమ క్రీడాకారులను దక్షిణ కొరియాలో జరగబోయే శీతాకాల ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి పంపిస్తానని చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రపంచానికి షాకింగ్ న్యూస్.. ఉత్తర కొరియా 15 ప్రదేశాల్లో అణు దాడి చేయవచ్చని నిఘా వర్గాల సమాచారం. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, గ్వామ్ ద్వీపాలే లక్ష్యంగా జిమ్ అణు బాంబు దాడికి సిద్ధమయ్యారని యూరోపియన్ కమీషన్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్ (ఈయూఎఫ్ఆర్) తెలిపింది.
ఒక చిన్న దేశం ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది.. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. దీనికంతటికి కారణం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈయన్ను అందరూ 'నియంత', 'క్షిపణులను నిర్మించాలని కోరుకొనే పిచ్చివాడు', అని చెబుతారు. కిమ్ గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఎంత వరకు చదువుకున్నాడు, ఆయన ఆసక్తుల గురించి ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడూ ఆయుధాలతో సావాసం చేసే కిమ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
* కిమ్ ఓ స్విస్ స్కూల్ లో విద్యను అభ్యసించారు అని చెబుతారు.
ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్ష చేసేందుకు సిద్ధంగా ఉందని.. అందుకు అనువైన రోజు కోసం ఎదురు చూస్తోందని అమెరికా ఇంటెలిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్ 10న ఉత్తర కొరియాలో జరగబోయే వర్కర్స్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని.. బలప్రదర్శనకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అమెరికాలోని పలు సీక్రెట్ ఏజెన్సీలు అప్రమత్తమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా అక్టోబర్ 9న అమెరికాలో ‘కొలంబస్ డే’ కావున, సాధారణంగా సెలవుదినంగా ప్రకటిస్తారు.
గత కొంతకాలంగా సాగుతున్న ఉత్తర కొరియా, అమెరికాల మధ్య అరాచక రాజకీయాలు ఎలాంటి భవిష్యత్తు మారణహోమాలకు నాంది పలుకుతాయోనని ఆయా రాజ్యాల సరిహద్దు దేశాలు కలవరపడుతున్నాయి. అమెరికాను క్షమించేది లేదని.. దాని వినాశనమే తమ లక్ష్యమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. దాదాపు 2 లక్షల మంది దేశ పౌరులు ఆర్మీలో చేరిన క్రమంలో 'యాంటీ అమెరికా వార్' అంటూ సాగిన స్లోగన్స్ మధ్య వారికోసం కిమ్ జోంగ్ ఒక ప్రత్యేక మీటింగును ఏర్పాటు చేశారు.
ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా దూకుడు వైఖరి ప్రదర్శిస్తున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం...ఇప్పటి వరకు క్షిపణుల ప్రయోగాలు చేస్తుంటే అమెరికాతో బేరసారాల కోసమనుకున్నాం..అయితే ఇప్పడు ఏకంగా జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగించి యుద్ధానికి సై అంటూ సవాల్ విసురుతోంది. ఓ చిన్న సాధారణ దేశం.. అగ్రరాజ్యమైన అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలతో పాటు ఐరోపా దేశాలను లెక్కచేయకుండా ఇంతటి దూకుడు వైఖరి ప్రదర్శిస్తుందంటే..తన సొంత వైఖరిని ప్రదర్శిస్తుందా.. లేక ఏదైన బలమైన శక్తి అండతో ఇలా వ్యవహరిస్తోందా ?..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.