ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ (Kim Jong-un) ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపొందించే చట్టాలు.. వేసే శిక్షలు అలా ఉంటాయి. జోంగ్ ప్రతీ విషయంపై అనవసర నిర్ణయాలు తీసుకుంటూ.. కొన్ని దేశాలకు కొరకరానికొయ్యగా మారారు. జోంగ్ ఏక్షణంలో అయినా.. వార్తల్లో నిలుస్తారు.. ఎందుకంటే ఆయన తీసుకునే చర్యలు.. చేష్టలు అలా ఉంటాయి.
సింగపూర్ వేదికగా అమెరికా-ఉత్తరకొరియా మధ్య చారిత్రక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పంద పత్రాలపై ఆయా దేశాల అధ్యక్షులు ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఇరు దేశాల మధ్య జరిగిన నాలుగు ఒప్పందాలు ఇలా ఉన్నాయి..
నన్ను భయపెట్టేందుకే ట్రంప్ ఆసియా పర్యటనకు వచ్చాడని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ధ్వజమెత్తాడు. ఆయన యుద్ధాన్ని అడుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా ట్రంప్ ఉత్తర కొరియాను భయపెట్టలేడని అన్నారు. ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన మా అణ్వాయుధాల అభివృద్ధి ఇకపై వేగం పుంజుకుంటాయని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.