Smriti Mandhana named RCB captain for WPL 2023: మరికొద్ది రోజుల్లో క్రికెట్ పండుగ మొదలు కాబోతుంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటిచండంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 31న గుజరాత్, చెన్నై జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ టైటిల్ వేట మొదలు కానుంది. పురుషుల ఐపీఎల్ కంటే ముందు మహిళల డబ్యూపీఎల్ జరగబోతుంది. ఇప్పటికే వేలం ప్రక్రియ పూర్తవ్వగా.. స్టార్ ప్లేయర్లకు మంచి ధర దక్కింది. టీమిండియా స్టార్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3 కోట్ల 40 లక్షలకు తమ జట్టులోకి తీసుకుంది. అందరి ప్లేయర్ల కంటే అత్యధిక ధర స్మృతికే దక్కింది.
మంధానను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్ తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో స్మృతి మంధాన పేరును కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ కెప్టెన్సీని ప్రకటించారు. మంధాన కెప్టెన్సీ బాధ్యతలు అప్పటించనున్నట్లు వేలం రోజే ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హుస్సన్ వెల్లడించారు. స్మృతికి కెప్టెన్సీ అనుభవం పుష్కలంగా ఉందని.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తుందన్నారు.
From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League - Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu
— Royal Challengers Bangalore (@RCBTweets) February 18, 2023
26 ఏళ్ల స్మృతి మంధాన టీమిండియా ఇప్పటివరకు 112 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 27.33 సగటుతో 2651 రన్స్ చేసింది. భారత్ తరపున 77 వన్డేలు ఆడగా.. 42.68 సగటుతో 3073 పరుగులు చేసింది. స్మృతి మంధాన 4 టెస్టుల్లో 325 రన్స్ చేసింది. 11 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించింది. ఇందులో ఆరింటిలో విజయం సాధించగా.. ఐదు మ్యాచ్‌లో జట్టు ఓటమి పాలైంది. మహిళల టీ20 ఛాలెంజ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌కు కూడా స్మృతి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
"విరాట్, డుప్లెసిస్ నాయకత్వం వహించడం గురించి చాలా మాట్లాడటం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. అభిమానుల ప్రేమ, మద్దతు గెలుచుకునేందుకు రెడీగా ఉన్నాను. డబ్యూపీఎల్‌లో విజయం కోసం నేను 100 శాతం కష్టపడతాను.." అని మంధాన తెలిపింది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఎల్లీస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్ వంటి స్ట్రాంగ్ ప్లేయర్లను వేలంలో తీసుకుంది ఆర్సీబీ. ఈ టోర్నమెంట్ మార్చి 4న ప్రారంభమవుతుంది.
ఆర్సీబీ జట్టు ఇలా..
స్మృతి మంధాన రూ.3.40 కోట్లు, రిచా ఘోష్ రూ.1.90 కోట్లు, ఎల్లీస్ పెర్రీ రూ.1.70 కోట్లు, రేణుకా సింగ్ రూ.1.50 కోట్లు, సోఫీ డివైన్ రూ.50 లక్షలు, హీథర్ నైట్ రూ.40 లక్షలు, మేగన్ షట్ రూ.40 లక్షలు, కనికా లఖ్ రూ.35 లక్షలు, నిక్రిక్ రూ.30 లక్షలు, ఎరిన్ బర్న్స్ రూ.30 లక్షలు, ప్రీతి బోస్ రూ.30 లక్షలు, కోమల్ జంజాద్ రూ.25 లక్షలు, ఆశా శోభనరావు రూ.10 లక్షలు, దిశా కసత్ రూ.10 లక్షలు, ఇంద్రాణి రాయ్ రూ.10 లక్షలు, పూనమ్ ఖేమ్నార్ రూ.10 లక్షలు, సహనా పవార్ రూ.రూ.10 లక్షలు, శ్రేయాంక పాటిల్ రూ.10 లక్షలు.
Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి
Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి