IPL 2022: ఊరిస్తున్న కప్..ఈసారైనా ఆ ఢిల్లీ కేపిటల్స్‌కు దక్కేనా

IPL 2022: ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ఈసారైనా ఐపీఎల్ టైటిల్ అందుతుందా లేదా..అందని ద్రాక్షై ఊరుస్తుందా. కోట్లు ఖర్చుపెట్టి కీలకమైన ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్..ఐపీఎల్ 2022 టైటిల్ కోసం విశ్వ ప్రయత్నం చేయనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 19, 2022, 01:09 PM IST
 IPL 2022: ఊరిస్తున్న కప్..ఈసారైనా ఆ ఢిల్లీ కేపిటల్స్‌కు దక్కేనా

IPL 2022: ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు ఈసారైనా ఐపీఎల్ టైటిల్ అందుతుందా లేదా..అందని ద్రాక్షై ఊరుస్తుందా. కోట్లు ఖర్చుపెట్టి కీలకమైన ఆటగాళ్లను సొంతం చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్..ఐపీఎల్ 2022 టైటిల్ కోసం విశ్వ ప్రయత్నం చేయనుంది.

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌ నుంచి ఉన్నప్పటికీ ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. ఎంతో కష్టపడి గతేడాది ఫైనల్‌‌కు చేరినప్పటికీ.. ప్రత్యర్థి చేతిలో ఓటమి మూటగట్టుకుని రన్నరప్‌‌గా నిలిచింది. మరీ ఈసారి ఐపీఎల్‌ మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని స్ట్రాంగ్‌ ఉన్న ఆ టీం ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందా? 

2008 లో  ఐపీఎల్‌ ప్రారంభమైంది. అప్పటినుంచి వరుసగా అన్ని సీజన్లలో ఆడిన జట్లలో ఢిల్లీ కూడా ఒకటి. కానీ ఇప్పటివరకు ఆ టీం ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా టైటిల్‌‌ను ముద్దాడలేకపోయింది.  ఒకే ఒక్కసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన మూడు జట్లలో ఢిల్లీ కేపిటల్స్ కూడా ఒకటి. అదీ మెగా టోర్నీ ప్రారంభమైన దాదాపు పన్నెండేళ్ల తర్వాత. 2020లో యువ కెప్టెన్‌ రిషభ్‌పంత్‌ నేతృత్వంలోని ప్లేఆఫ్స్‌ వరకు వెళ్లినా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈసారి ఐపీఎల్‌ మెగా వేలంలో కీలక ఆటగాళ్లను దక్కించుకుని మరీ బరిలోకి దిగబోతోంది. 

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ కోసం ఢిల్లీ జట్టు భారీ మొత్తం వెచ్చించింది. గత రెండు సీజన్‌లు తప్పించి అంతకుముందు వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌, సారథిగా ఫ్రాంచైజీకి టైటిల్‌ను అందించిన డేవిడ్ వార్నర్‌‌ను 6 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకొంది. అండర్‌ -19 ప్రపంచకప్‌ టైటిల్‌ను అందించిన యువ భారత్‌ కెప్టెన్‌ యష్ ధుల్‌తో సహా స్పిన్నర్‌ విక్కీ ఓత్స్వాల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసుకుంది. ఇక బ్యాటింగ్‌ పరంగా ఢిల్లీ కేపిటల్స్  పెద్దగా ఇబ్బందులేమీ లేవు. అయితే విదేశీ ఆటగాళ్ల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. రిషభ్‌ పంత్, పృథ్వీ షా, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్‌ ఖాన్‌,  పావెల్‌, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్‌, టిమ్‌ సీఫెర్ట్‌, కేఎస్‌ భరత్‌ కీలక ప్లేయర్లుగా ఉన్నారు. గత సీజన్‌ వరకు పృథ్వీషాకు తోడుగా శిఖర్ ధావన్‌ ఓపెనింగ్‌కు దిగేవాడు. ఈసారి ప్రమాదకర బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వచ్చేస్తాడు. వీరిద్దరూ కాసేపు నిలబడితే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. 

ఢిల్లీ కేపిటల్స్ చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంటర్నేషనల్‌ పేసర్లు, స్పిన్నర్లతో పటిష్టంగా ఉంది. ఆన్రిచ్‌ నార్జ్‌, లుంగి ఎంగిడి, చేతన్‌ సకారియా, ఖలీల్‌ అహ్మద్, ముస్తాఫిజర్‌ రెహ్మాన్, అక్షర్‌ పటేల్, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మిచెల్ మార్ష్, కమ్లేష్ నాగర్‌కోటి వంటి బౌలర్లతో పేస్‌ విభాగం ధృఢంగా కనిపిస్తోంది. టీట్వంటీ ఫార్మాట్‌‌లో కీలకమైన ఆల్‌ రౌండర్లు ఢిల్లీ జట్టులో ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న అక్షర్‌ పటేల్‌ను ఢిల్లీ రీటెయిన్‌ చేసుకుంది. శార్దూల్‌ ఠాకూర్‌, మిచెల్‌ మార్ష్, పావెల్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు. మొత్తంగా ఢిల్లీ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌, పంత్‌ నాయకత్వంలోని ఢిల్లీ ఈ సారైనా మిరాకిల్‌ చేసి టోఫ్రీని లిఫ్ట్‌ చేస్తుందా.. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also read: Special Story on RR: ఈ సారైనా రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీని ముద్దాడేనా..?? స్పెషల్ స్టోరీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News