CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!

CSK vs DC, IPL 2022: MS Dhoni Trolls Dwayne Bravo. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావోని సరదాగా ట్రోల్ చేశాడు. 'వెల్డన్ ఓల్డ్ మ్యాన్' అంటూ ప్రశంసించాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2022, 03:50 PM IST
  • ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు
  • చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ
  • ఇంకోసారి ఆడాల్సి వస్తే.. నన్ను పిలవకు అని చెప్పా
CSK vs DC: ఓల్డ్ మ్యాన్ బాగా ఆపావు.. చెన్నై స్టార్ ఆటగాడిని ట్రోల్ చేసిన ఎంఎస్ ధోనీ!

MS Dhoni Trolls Dwayne Bravo during CSK vs DC match in IPL 2022: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆల్‌రౌండర్‌ డ్వేన్ బ్రావో మైదానంలోనే కాదు వెలుపల కూడా మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ధోనీ నాకు పెద్దన్న అని చాలా సందర్భాల్లో బ్రావో చెప్పాడు. అంతేకాదు ఐపీఎల్ 2020 సందర్భంగా మహీ పుట్టిన రోజుకు బ్రావో ప్రత్యేకంగా ఓ పాటను కూడా రూపొందించాడు. చాలా ఏళ్లుగా చెన్నైకి ఆడుతున్న ధోనీ, బ్రావో మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఇద్దరు అప్పుడప్పుడు జోకులు వేసుకుంటారు. తాజాగా మహీ.. విండీస్ ఆటగాడిని సరదాగా ట్రోల్ చేశాడు. 

ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం (మే 8) డివై పాటిల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ ఛేజింగ్‌ చేస్తుండగా.. 17వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని తీక్షణ వేయగా.. అన్రిచ్ నోర్జ్ ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావో డైవ్ చేసి మరీ బంతిని ఆపాడు. ఇది చూసిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అతడిని సరదాగా ట్రోల్ చేశాడు. 'వెల్డన్ ఓల్డ్ మ్యాన్' అంటూ ప్రశంసించాడు. 

ఎంఎస్ ధోనీ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఫాన్స్ నవ్వులు పూయిస్తున్నారు. అంతేకాదు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తోంది. ఇక చివరి ఓవర్లో రాబిన్ ఉతప్ప ఔట్ అనంతరం ధోనీ, బ్రావో కలిసి చివరి మూడు బంతులు ఆడారు. చివరి రెండు బంతులకు మహీ రెండేసి పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రావో మాట్లాడుతూ... 'ఇన్నింగ్స్ అనంతరం నేను ధోనీతో మాట్లాడా. ఇలా చివరి బంతులు ఇంకోసారి ఆడాల్సి వస్తే.. నన్ను పిలవకు అని చెప్పా అని అన్నానని' తెలిపాడు. 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. డెవాన్ కాన్వే (87; 49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ (41; 33 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), శివమ్ దూబే (32; 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్‌ మార్ష్‌ (25), శార్దుల్‌ ఠాకూర్‌ (24) టాప్ స్కోరర్లు. 

Also Read: MS Dhoni Bat: అందుకే ఎంఎస్ ధోనీ బ్యాట్‌ కొరుకుతాడు.. అసలు విషయం చెప్పేసిన అమిత్‌ మిశ్రా!

Also Read: F3 Movie Trailer: మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో వెంకటేష్, వరుణ్ తేజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News