నిజం చెప్పాలంటే, నేను ఆ విషయం గురించే ఆలోచించడం లేదు : విరాట్ కోహ్లీ

Last Updated : Jan 2, 2019, 10:18 PM IST
నిజం చెప్పాలంటే, నేను ఆ విషయం గురించే ఆలోచించడం లేదు : విరాట్ కోహ్లీ

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియా రేపటి 4వ టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధమవుతోంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. అందులో 2 మ్యాచ్ లు గెల్చుకుని సిరీస్ లో పైచేయి సాధించింది. రేపటి నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే, సిరీస్ టీమిండియా వశమవడమేకాదు.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెల్చుకున్న టీమిండియా జట్టుగా కోహ్లీ సేన చరిత్ర సృష్టించనుంది. బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీని.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెల్చిన భారత జట్టుగా చరిత్ర సృష్టించనుండటం ఎలా అనిపిస్తోంది అని అడుగుతూ మీడియా అతడి వివరణ కోరింది. మీడియా అడిగిన ఈ ప్రశ్నపై స్పందించిన విరాట్ కోహ్లీ.. నిజాయితీగా చెప్పాలంటే అసలు తాను ఆ విషయం గురించే ఆలోచించడం లేదని స్పష్టంచేశాడు. "ఇక్కడికొచ్చి గెలుపును సొంతం చేసుకోవడం ఎంత కష్టమో ఒక క్రికెటర్‌గా తనకు బాగా తెలుసు. కోల్పోయినవి ఏవీ మన చేతుల్లో వుండవు. రాబోయే విజయాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. కేవలం ప్రస్తుతం మాత్రమే మన చేతుల్లో వుంది. అందుకే ప్రస్తుతం ఏం చేయాలో దాని గురించి మాత్రమే ఆలోచిస్తే చాలు" అని చాలా కూల్‌గా సమాధానం ఇచ్చాడు. 

మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, తొలిసారిగా బాక్సింగ్ డే టెస్ట్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టడం విశేషం.

Trending News