టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జరిగిన రెండో భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. రాజ్‌కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో శనివారం న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో 7 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ కూడా చేసింది.
కోహ్లీ 212 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, కేవలం 192 ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ ఈ ఘనతను సాధించి, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే, న్యూజిలాండ్తో జరిగిన ఒడిఐ సిరీస్ లో, కోహ్లీ 9,000 వన్డే పరుగులను సాధించి 'ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బ్యాట్స్ మెన్' గా ఘనత దక్కించుకున్నాడు.
#TeamIndia Captain @imVkohli now becomes the 2nd highest run getter in T20Is pic.twitter.com/mOQfT8FBt8
— BCCI (@BCCI) November 4, 2017