Gutkha Man: ప్లకార్డుతో ప్రత్యక్షమైన కాన్పూర్ 'గుట్కా మ్యాన్'-ఈసారి మంచి మెసేజ్‌తో వచ్చాడు

Gutkha Man: భారత్-న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా గ్యాలరీలో గుట్కా నములుతూ కనిపించిన శోభిత్ పాండే అనే వ్యక్తిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిజానికి ఆ సమయంలో తాను గుట్కా తినలేదని తాజాగా అతను మీడియా ముందుకొచ్చాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 01:00 PM IST
  • భారత్-న్యూజిలాండ్ టెస్టులో వైరల్‌గా మారిన గుట్కా మ్యాన్ వీడియో
    ప్లకార్డుతో మళ్లీ ప్రత్యక్షమైన గుట్కా మ్యాన్
    పొగాకు తినడం చెడు అలవాటని సందేశం
 Gutkha Man: ప్లకార్డుతో ప్రత్యక్షమైన కాన్పూర్ 'గుట్కా మ్యాన్'-ఈసారి మంచి మెసేజ్‌తో వచ్చాడు

Gutkha Man: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ (India Vs New Zealand) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటిరోజు 'గుట్కా మ్యాన్' వీడియో వైరల్‌గా (Gutkha Man Viral Video) మారిన సంగతి తెలిసిందే. గ్యాలరీలో కూర్చొన్న అతను నోటి నిండా గుట్కాతో ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో స్టేడియం స్క్రీన్‌పై కనిపించింది. ఆ తర్వాత అదే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. నిజానికి క్రికెట్ స్టేడియంలో గుట్కాపై నిషేధం ఉంది. అలాంటిది ఆ వ్యక్తి స్డేడియం గ్యాలరీలో దర్జాగా కూర్చొని గుట్కా నమలడంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో తాను గుట్కా నమలలేదని... అనవసరంగా తనపై ట్రోల్స్ చేస్తున్నారని సదరు వ్యక్తి మీడియా ముందుకొచ్చాడు.

గుట్కా మ్యాన్‌గా (Gutkha Man) మీడియాలో పాపులర్ అయిన అతని పేరు శోభిత్ పాండే. కాన్పూర్‌లోని మహేశ్వరి మహోల్ వాసి. మొదటి రోజు టెస్టు మ్యాచ్‌కు హాజరైన అతను... రెండో రోజు కూడా స్టేడియంకు వచ్చాడు. అయితే ఈసారి చేతిలో ఓ ప్లకార్డు పట్టుకుని వచ్చాడు. 'పొగాకు తినడం చెడు అలవాటు.' అని ప్లకార్డుపై హిందీలో రాశాడు. ఇదే విషయంపై మీడియాతో మాట్లాడుతూ...'మొదట నేను చెప్పాలనుకుంటున్న విషయమేంటంటే... ఆ సమయంలో నేను గుట్కా తినలేదు. వక్క పలుకులు నములుతూ నా స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నాను. అతను కూడా అదే స్టేడియంలో మరో స్టాండ్‌లో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్నాడు.' అని శోభిత్ పాండే తెలిపాడు.

'ఆ సమయంలో నేనెవరితోనైతే ఫోన్‌లో మాట్లాడానో... ఆ వ్యక్తే నా వీడియో వైరల్ (Gutkha Man Viral Video) అయిందని చెప్పాడు. అప్పుడే ఈ విషయం తెలిసింది. నిజానికి నేనేమీ తప్పు చేయలేదు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. అయితే స్టేడియంలో నాతో పాటు నా పక్కనే కూర్చొన్న నా సోదరిపై కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కొంత బాధ కలిగిస్తోంది. మరోవైపు మీడియా చానెళ్ల నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇదంతా నాకు చికాకు తెప్పిస్తోంది.' అని శోభిత్ పాండే పేర్కొన్నాడు. శోభిత్ పాండే వీడియోను మాజీ ఇండియన్ క్రికెటర్ వసీం జాఫర్ సైతం ట్విట్టర్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

 

Also Read: Shreyas Iyer: డ్యాన్స్ తో అదరగొట్టిన రోహిత్, శ్రేయస్..వీడియో వైరల్

ఇక టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే... భారత్ (India Vs New Zealand) తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ వికెట్లేమీ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. మూడో రోజు స్పిన్నర్ అశ్విన్, పేసర్ ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. దీంతో ప్రస్తుతం న్యూజిలాండ్ 209-2 స్కోరుతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరాలంటే మరో 136 పరుగులు చేయాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News