MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?

MS Dhoni: భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.

Written by - Alla Swamy | Last Updated : Sep 24, 2022, 07:37 PM IST
  • ధోనీ నుంచి మరో కబురు
  • గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారని ప్రచారం
  • సర్‌ప్రైజ్‌పై ఆసక్తి
MS Dhoni: రేపు సోషల్‌ మీడియా లైవ్‌లోకి ఎంఎస్ ధోనీ..ఆ విషయాన్నే చెప్పబోతున్నాడా..?

MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. ఈనెల 25న(ఆదివారం) శుభవార్త చెప్పనున్నట్లు చెప్పాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియా లైవ్‌లో పాల్గొంటానని..అందులో గుడ్‌న్యూస్ చెప్పబోతున్నానని తెలుస్తోంది. ధోనీ చెప్పబోయే ఆ విషయం ఏంటో అన్న ఆసక్తి నెలకొంది. క్రికెట్‌పై చెప్పబోతారా..లేక వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా అని అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. 

2019 వరల్డ్ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ దూరంగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈఏడాది ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారధి బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను ఆల్‌రౌండర్ జడేజా అప్పగించాడు. ఐతే అతడి ఆధ్వర్యంలో చెన్నై వరుసగా ఓటమి పాలైంది.

దీంతో తిరిగి చెన్నై జట్టు పగ్గాలను ఎంఎస్ ధోనీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆ జట్టు గెలిచింది. ఐనా నాకౌట్ దశకు చేరలేకపోయింది. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌లోనూ ఎంఎస్ ధోనీయే చెన్నై జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని తెలిపింది. దీనికి అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ..వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్నాడు. రేపు(ఆదివారం) ఏం చెప్పబోతున్నాడన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

Also read:IND vs AUS: ఆర్‌సీబీ కాదు..ఇది ఇండియా..అభిమానులపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..!

Also read:Bank Holidays October 2022: అక్టోబర్ నెలలో బ్యాంకుల సెలవు రోజులు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News