Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!

IPL 2022 Eliminator LSG vs RCB. Rajat Patidar postponed Marriage. ఐపీఎల్ 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో చెలరేగిన రజత్ పటీదార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే పటీదార్ ఐపీఎల్ 2022 కోసం తన పెళ్లిని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడట.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 07:20 PM IST
  • 4 మ్యాచ్‌లో 71 పరుగులు
  • వేలంలో కోలుగోలు చేయలేదు
  • పెళ్లి వద్దనుకున్న భారత యువ కెరటం
Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!

Rajat Patidar postponed his wedding after late call-up from Royal Challengers Bangalore: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా మరో భారత యువ ఆటగాడు క్రికెట్ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ రజత్ పటీదార్ అజేయ శతకం (112 నాటౌట్‌; 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ బౌలర్లపై చెలరేగి జట్టు స్కోర్ 200 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ఎలిమినేటర్‌లో బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. కీలక సమయంలో చెలరేగిన పటీదార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే పటీదార్ ఐపీఎల్ 2022 కోసం తన పెళ్లిని పోస్ట్ ఫోన్ చేసుకున్నాడట.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ 2021లో 4 మ్యాచ్‌లు ఆడిన రజత్ పటీదార్ 71 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అతని బెంగళూరు వదిలేసింది. మెగా వేలంలో కూడా అతడిని కోలుగోలు చేయలేదు. దాంతో పటీదార్‌కు నిరాశే ఎదురైంది. ఇక మే 9న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం చిన్న ఫంక్షన్, ఇండోర్‌లో ఓ హోటల్‌ను కూడా బుక్ చేశాడు. అయితే గాయం రూపంలో పటీదార్‌కు ఓ లక్కీ అవకాశం వచ్చింది.

ఐపీఎల్ ఆరంభంలో లువ్నిత్ సిసోడియాకు గాయం కావడంతో.. ఏప్రిల్ 3న రజత్ పాటిదార్‌ను రూ. 20 లక్షలకు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా బెంగళూరు ప్రాంచైజీ తీసుకుంది. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన పాటిదార్‌ 275 రన్స్ చేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఏకంగా సెంచరీ చేసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. పాటిదార్‌ సునామీ ఇన్నింగ్స్‌తో బెంగళూరు టైటిల్ సాధించే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇక శుక్రవారం క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో బెంగళూరు తలపడనుంది. 

రజత్ పాటిదార్‌ తండ్రి మనోహర్ పాటిదార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'మే 9న రజత్ పాటిదార్‌ వివాహంకు డేట్ ఫిక్స్ చేశాం. పెళ్లి అంగరంగ వైభవంగా కాకుండా కొద్దిమంది సమక్షంలోనే చేద్దామని ప్లాన్ చేశాం. అందుకే ఇన్విటేషన్ కార్డ్‌లు ప్రింట్ చేయలేదు. పరిమిత అతిథుల కోసం నేను ఇండోర్‌లో హోటల్‌ను కూడా బుక్ చేసాను. ఇంతలో ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. ఐపీఎల్ అనంతరం మధ్యప్రదేశ్ తరఫున రంజీ మ్యాచులు ఉన్నాయి. జులైలో రత్లామ్‌కి చెందిన అమ్మాయితో వివాహం చేయాలనుకుంటాం' అని చెప్పారు. 

Also Read: Pawan Kalyan in F3: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. ఎఫ్3 సినిమాలో పవన్ కళ్యాణ్!

Also Read: Lychee Benefits: వేసవిలో లీచీ పండ్లు తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News