Ranji Trophy 2022: రంజీ క్రికెడ్ నేడే ప్రారంభం, ఎన్ని జట్లు, ఎన్ని దశలు, ఎన్ని మ్యాచ్‌లు..ఇవే ఆ వివరాలు

Ranji Trophy 2022: దేశవాళీ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఇవాళ మొదలవుతోంది. రంజీలో ప్రతిభ చాటి జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2022, 09:44 AM IST
 Ranji Trophy 2022: రంజీ క్రికెడ్ నేడే ప్రారంభం, ఎన్ని జట్లు, ఎన్ని దశలు, ఎన్ని మ్యాచ్‌లు..ఇవే ఆ వివరాలు

Ranji Trophy 2022: దేశవాళీ క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న రంజీ ట్రోఫీ ఇవాళ మొదలవుతోంది. రంజీలో ప్రతిభ చాటి జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

టీమ్ ఇండియా క్రికెట్ జట్టుకు రంజీలే ప్రామాణికం. రంజీ ట్రోఫీలో ప్రతిభ చాటితే భారతజట్టులో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి క్రికెట్ ఆటగాడికి రంజీలు చాలా ముఖ్యం. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు ఇదొక మంచి వేదిక. అయితే కరోనా మహమ్మారి కారణంగా గత కొద్దికాలంగా రంజీ టోర్నమెంట్ వాయిదా పడుతూ వస్తోంది. రెండేళ్ల తరువాత తిరిగి ఇవాళ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్నాయి. చెన్నై తిరువనంతపురం, కటక్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఢిల్లీ, హర్యానా, గౌహతి, కోల్‌కతాలలో ఈ రంజీ మ్యాచ్‌లు జరగనున్నాయి. 

లోకల్ టాలెంట్ వెతికి తీసేందుకు, జట్టులో స్థానం కోల్పోయిన ఆటగాళ్లు తిరిగి ప్రతిభ చాటేందుకు ఇదొక మంచి వేదిక. అందుకే దేశవ్యాప్తంగా వివిధ రంజీ జట్ల నుంచి పలువురు సీనియర్ ఆటగాళ్లు కూడా బరిలో దిగుతున్నారు. దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో జగనున్న రంజీ టోర్నీలో 38 జట్లు తలపడుతున్నాయి. నాలుగేసి జట్ల చొప్పున 8 గ్రూపుల్లో 32 జట్లు ఉండగా..మిగిలిన ఆరు జట్లు ప్లేట్ గ్రూపులో తలపడబోతున్నాయి. 

రంజీ షెడ్యూల్ ఇలా

టోర్నీలో మొత్తం 65 మ్యాచ్ లుంటాయి. ఇందులో లీగ్ దశలో 57 మ్యాచ్‌లు జరుగుతాయి. 2022 మార్చ్ నెలలో ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో...రంజీ ట్రోఫీ 2022 రెండు దశల్లో జరగనుంది. లీగ్ దశ ఐపీఎల్‌కు ముందు జరుగుతుంది. నాకౌట్ దశను ఐపీఎల్ తరువాత నిర్వహించనున్నారు. రెండవ దశలో అంటే నాకౌట్ దశ మే 30 నుంచి జూన్ 26 వరకూ జరగనుంది. ఇటీవల కొద్దికాలంగా ఫాం లేక ఇబ్బంది పడుతున్న టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారాలు ఈసారి రంజీ బరిలో ఉన్నారు. అజింక్యా రహానే ముంబై నుంచి , పుజారా మహారాష్ట్ర నుంచి ఆడుతున్నారు. త్వరలో జరగనున్న శ్రీలంక సిరీస్‌కు ఎంపికవాలంటే పుజారా, రహానేలు తప్పకుండా తమ ప్రతిభ నిరూపించుకోవల్సి ఉంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇదే దిశగా సంకేతాలిచ్చాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడవని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ రంజీ బరిలో ఉన్నాడు. 

ఇక రంజీ ట్రోఫీలో(Ranji Trophy) తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ పాల్గొంటున్నాయి. తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు..ఎలైట్ గ్రూప్ బి లోని బెంగాల్, బరోడా, చండీగఢ్‌లతో తలపడనుంది. శ్రీకర్ భరత్ సారధ్యంలోని ఆంధ్ర జట్లు రాజస్థాన్, ఉత్తరాఖండ్ జట్లతో కూడిన ఎలైట్ గ్రూపు ఈ తో తలపడనుంది. ఇక బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హార్ధిక్ పాండ్యా ఈసారి రంజీ బరిలో దిగడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఫిట్‌నెస్ కారణంగా తప్పుకున్న హార్ధిక్ పాండ్యాను వెస్టిండీస్ పర్యటను ఎంపిక చేయలేదు. హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) గత కొద్దికాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైకూన్స్ 15 కోట్లకు ఇతడిని సొంతం చేసుకుంది. అంతేకాకుండా తమ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాగా ప్రకటించింది. ఈ నేపధ్యంలోని ఈసారి రంజీ బరిలో దిగడం లేదు. 

Also read: IND vs WI 1st ODI LIVE*: మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. 40 పరుగులకు రోహిత్ శర్మ ఔట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News