హాంకాంగ్ ఫైనల్లో సింధూ ఓటమి

హాంకాంగ్ ఫైనల్లో పీవీ సింధూ ఓడిపోయింది. చివరికి వరకు సాగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ప్రత్యర్థితో పీవీ హోరాహోరీగా తలపడింది.

Last Updated : Nov 26, 2017, 03:13 PM IST
హాంకాంగ్ ఫైనల్లో సింధూ ఓటమి

హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బ్రేక్ పడింది. ప్రపంచ నెంబర్ 1 తై జూ యింగ్(చైనా) చేతిలో ఓడింది. 18-21, 18-21 తేడాతో పీవీ సింధూ పరాజయాన్ని చవిచూసింది. సింధూ తొలి గేమ్ లో కాస్త వెనుకంజలో ఉన్నా.. ఆతరువాత ప్రత్యర్థికి గట్టిపోటీనే ఇచ్చింది. ఒకానొక దశలో 18-18 తో సమంగా నిలిచింది. ఆతరువాత ప్రత్యర్థి వేగం పుంజుకోవడంతో మొదటి గేమ్ లో ఓడిపోయింది. 

కాస్త విరామ తీసుకొని రెండో గేమ్ ప్రారంభించారు సింధూ, తైజు యింగ్. ఈ గేమ్ లో కూడా పీవీ ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడింది. ఆట ప్రారంభములో చక్కటి ప్రదర్శన కనబరిచి 5-5 తేడాతో సమంగా నిలిచింది. ఆతరువాత 9-11 తేడాతో, 14-19 స్వల్ప తేడాతో పీవీ సింధూ ముందుకు దూసుకెళ్లినా.. తై జూ యింగ్ కే విజయం వరించింది. పీవీ సింధూ వెండి పతకాన్ని కైవసం చేసుకుంది.

Trending News