Chiranjeevi Nagababu Fight: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ హ్యాపీగా ఉంది. అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గౌరవం మెగా అభిమానుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ గెలిచిన తరువాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం.. ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి స్టేజ్‌పై ముగ్గురు అభివాదం చేయడం ఎప్పటికీ మర్చిపోరు.
చిరంజీవికి తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నాగబాబును ప్రొడ్యూసర్‌ను చేయగా.. తమ్ముడిని టాలీవుడ్లో టాప్ హీరోగా నిలబెట్టారు.
తన ఇంటర్మీడియట్ రోజుల్లో జరిగిన ఓ సంఘటనను చిరంజీవి గతంలో ప్రస్తావించగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాను ఇంటర్ చదివే సమయంలో నాగబాబు ఆరు, ఏడో చదువుతున్నాడని.. అప్పట్లో తాను అమ్మకు అన్ని విషయాల్లో సహాయకారిగా ఉండేవాణ్ణి చిరు గుర్తు చేసుకున్నారు.
ఒక రోజు లాండ్రీ నుంచి తాను బట్టలు తీసుకురావల్సి ఉందని.. కానీ అదే సమయంలో మరో చోటుకు పనిమీద వెళ్లాల్సి వచ్చిందన్నారు చిరంజీవి. లాండ్రీ నుంచి బట్టలు తీసుకురమ్మని నాగబాబుకు చెప్పి వెళ్లానని.. ఇంటికి తిరిగి వస్తే తీసుకురాలేదన్నారు. ఎందుకు తీసుకురాలేదని నాగబాబును అడిగితే.. నిద్ర పోతున్నానంటూ పెడసరిగా చెప్పడంతో కోపంతో వచ్చి చావ చితక బాదేశానని చెప్పారు.
అది చూసిన మా అమ్మ.. చిన్నోడిని కొడతావా అంటూ తనను బాగా తిట్టారని అన్నారు. సాయంత్రం మా నాన్న రాగానే ఏడుస్తూ విషయం మొత్తం చెప్పి.. నాగబాబును తిట్టించానని అన్నారు. అప్పుడు తన కోపం చల్లారిందన్నారు.
ఇండస్ట్రీలోకి మొదట నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. ఆ తరువాత ప్రొడ్యూసర్‌గా మారారు. తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మించారు.
మెగాస్టార్ చిరంజీవి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారూ బాగున్నారా, స్టాలిన్ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రామ్ చరణ్‌తో ఆరెంజ్, పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాలను నిర్మించారు. అయితే నాగబాబు ప్రొడ్యూసర్‌గా సక్సెస్ కాలేకపోయారు.