Rohit Sharma : రోహిత్ శర్మ సెంచురీతో తోకముడిచిన బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ 2019 సెమీస్ హైలైట్స్

Coronavirus : కరోనా సంక్షోభం  ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో  క్రికెట్ ( International Cricket )  కు కూడా మినహాయింపు లభించలేదు.  కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు.  అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు  ఒక గుడ్ న్యూస్ ఉంది. 

Last Updated : Jul 2, 2020, 04:14 PM IST
Rohit Sharma : రోహిత్ శర్మ సెంచురీతో తోకముడిచిన బంగ్లాదేశ్.. వరల్డ్ కప్ 2019 సెమీస్ హైలైట్స్

Coronavirus : కరోనా సంక్షోభం  ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై పడింది. ఇందులో  క్రికెట్ ( International Cricket )  కు కూడా మినహాయింపు లభించలేదు.  కరోనా కల్లోలం ( Corona Pandemice) ప్రారంభం అయినప్పటి నుంచి కొత్తగా మ్యాచులు లేకపోవడం వల్ల అభిమానులు తీవ్రంగా నిరాశపడుతున్నారు.  అయితే క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ ఏంటంటే మరో వారం రోజుల్లో (జులై 8 -12 ) ఇంగ్గాండ్ - వెస్ట్ ఇండీస్ ( England vs West indies test 2020 ) మధ్య టెస్టు మ్యాచు ప్రారంభం కానుంది. అయితే అప్పటి  వరకు క్రికెట్ను మిస్ అయ్యే వారు పాత మ్యాచులు చూసుకుని ఆనందించవచ్చు.  Read Also :  అవతార్ ఫీచర్ ను లాంచ్ చేసిన facebook..

సరిగ్గా సంవత్సరం క్రితం అంటే 2 జులై 2019న ప్రపంచ కప్ ( Cricket World Cup 2019 ) సెమీస్ లో చోటు సంపాదించడానికి  టీమ్ ఇండియా ( Team India )  వీరోచిత పోరాటం చేసింది. ఇందులో రోహిత్ శర్మ ( Rohit Sharma )  అద్భుతమైన  సెంచరీతో  భారత్ కు భారీ స్కోర్ ను సాధించి పెట్టాడు. తొలి వికెట్కు రోహిత్ వర్మ- కెఎల్ రాహల్ ( KL Rahul ) కలిసి మొత్తం 180 పరుగుల చేయగా.. నిర్ణీత 50 ఓవర్లలో టీమ్ ఇండియా 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించింది.

 

అయితే భారీ లక్ష్మంతోె బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీమ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి  సెమిఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.  

Trending News