ICC World Cup 2023, NED VS SA: వరల్డ్ కప్ లో సంచనాలు నమోదవుతున్నాయి. అక్టోబరు 15న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు ఆఫ్గానిస్థాన్ షాకిస్తే.. తాజాగా సౌతాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ చిత్తు చిత్తుగా ఓడించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది డచ్ టీమ్.
అందరూ తడబడినా.. కెప్టెన్ నిలబడ్డాడు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది నెదర్లాండ్స్ జట్టు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ను 43 ఓవర్లను కుదించారు. డచ్ జట్టు నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ ఎడ్వర్డ్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. 69 బంతులు ఎదుర్కొన్న ఎడ్వర్డ్స్ 10 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 78 పరుగులు చేశాడు. ఇక ఆ టీమ్ లోని తెలుగు ఆటగాడు తేజ నిడమానూరు 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత సంతతి ఆటగాడైన ఆర్యన్ దత్ చివర్లో చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 3 సిక్సర్లు బాది 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గతంలో సౌతాఫ్రికా జట్టు తరుపున ఆడి.. ఇప్పుడు నెదర్లాండ్ కు ఆడుతున్న వాన్ డెర్ మెర్వ్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి, మార్కో యాన్సెన్, కగిసో రబాడా రెండేసి వికెట్లు తీశారు.
చెలరేగిన డచ్ బౌలర్లు..
అనంతరం ఛేదనను ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఓపెనర్లు బవుమా, డికాక్ శుభారంభం ఇచ్చినప్పటికీ దానిని మిగతా బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. బవుమా 16 పరుగులు, డికాక్ 20 పరుగులు చేసి ఔటయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డస్సెన్, మాక్రమ్ కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమ్యారు. ఆ తర్వాత క్లాసెన్(28) తో జతకలిసిన డేవిడ్ మిల్లర్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మిల్లర్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 43 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. కోయెట్జీ కూడా బాగానే ఆడాడు. ఇతడు 23 బంతుల్లో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆఖర్లో కేశవ్ మహారాజ్ మెరుపులు మెరిపించినప్పటికీ జట్టుకి విజయాన్ని అందించలేకపోయాడు. మహారాజ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 40 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో సౌతాప్రికా నిర్ణీత 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. డచ్ బౌలర్లలో లోగన్ వాన్ బిక్ మూడు వికెట్లు తీశాడు.
Also Read: ENG vs AFG Highlights: ప్రపంచకప్‍లో డిఫెండింగ్ ఛాంపియన్‍కు షాకిచ్చిన అఫ్గానిస్థాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి