MS Dhoni Retirement: రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ఎంఎస్ ధోనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు.. అసలు విషయం చెప్పేసిన మాజీ కోచ్!

R Sridhar unheard of revelation about MS Dhoni retirement. ఎంఎస్ ధోనీ ఎప్పుడు రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడో మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తాజాగా తెలిపాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 13, 2023, 06:18 PM IST
  • రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ధోనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు
  • అసలు విషయం చెప్పేసిన మాజీ కోచ్
  • 2020 ఆగష్టులో క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌
MS Dhoni Retirement: రిటైర్‌మెంట్‌ తీసుకోవాలని ఎంఎస్ ధోనీ అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు.. అసలు విషయం చెప్పేసిన మాజీ కోచ్!

R Sridhar reveals MS Dhoni Retirement Date and Converastion with Rishabh Pant: ఎంఎస్ ధోనీ.. క్రికెట్ అభిమానులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మాత్రమే కాకూండా మిస్టర్ కూల్ కూడా. అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన ఏకైక సారథి కూడా మహీనే. అయితే 2020 ఆగష్టులో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2019 ప్రపంచకకప్‌లో సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తరఫున చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ ఆడిన ఏడాది తర్వాత రిటైర్‌మెంట్‌ ఇచ్చాడు. అయితే మహీ ఎప్పుడు రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడో మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తాజాగా తెలిపాడు.

‘కోచింగ్‌ బియాండ్’ పేరిట రాసిన పుస్తకంలో ఆర్ శ్రీధర్‌ పలు విషయాలను వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌ రిజర్వ్‌ డే రోజు ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్‌ల మధ్య జరిగిన సంభాషణతో మహీ త్వరలోనే రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకోబోతున్నాడు అని తనకు అర్థమైందని చెప్పారు. 'నేను చాలా ప్రాక్టికల్‌గా ఉంటా. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత బీసీసీఐతో ఇంటర్య్వూలో నేను పాల్గొన్నా. భారత్ తరఫున ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్‌ ఆడేశాడని చెప్పా. అయితే అప్పటికి ధోనీ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించలేదు. దాంతో అందరు విషయం ఏంటని అడిగారు' అని శ్రీధర్‌ తెలిపారు.

'న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ రిజర్వ్‌ డే ఉదయం టిఫన్ కోసం హాల్‌లోకి వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. నేను కాఫీ తాగుతూ ఉన్నా. కాసేపటికి ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్ వచ్చారు. టిఫిన్ తీసుకొని నా టేబుల్‌ వద్దకు వచ్చి కూర్చొన్నారు. వర్షం కారణంగా వాయిదా పడిన న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 23 బంతులను మాత్రమే మనం బౌలింగ్‌ చేయాల్సి ఉందని.. ఆ తర్వాత మనం బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుందని.. త్వరగానే మ్యాచ్‌ ముగిసే అవకాశం ఉందని మాట్లాడుకున్నారు' అని మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ చెప్పారు. 

'ఆ సమయంలో ఎంఎస్ ధోనీతో రిషబ్ పంత్ హిందీలో మాట్లాడాడు. 'మహీ భయ్యా.. ప్రైవేట్‌గా ఇవాళే కొందరు ఫైనల్‌ వేదిక అయిన లండన్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. నువ్ వస్తావా? అని అడిగాడు. ఎంఎస్ సమాధానం ఇస్తూ లేదు పంత్.. నేను జట్టుతో చివరిసారిగా ప్రయాణం మిస్‌ అవ్వాలనుకోవడం లేదు' అని అన్నాడు. దీంతో మహీ రిటైర్‌మెంట్‌ విషయంలో అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడని నాకు అనిపించింది'అని శ్రీధర్ చెప్పుకొచ్చారు.

ఎంఎస్ ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారు. అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ బాదారు. ఇందులో 10 సెంచరీలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. 98 టీ20 మ్యాచ్‌లలో 1,617 పరుగుల చేశారు. ఇక ఐపీఎల్ టోర్నీలో 234 మ్యాచులు ఆడిన ధోనీ.. 4,978 రన్స్ బాదారు.

Also Read: Kuldeep Yadav: తుది జట్టు కూర్పు చాలా ముఖ్యం.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి: కుల్దీప్ యాదవ్  

Also Read: Best Selling 7 Seater Car: చౌకైన 7 సీటర్ కారు.. ఆల్టో, వ్యాగన్ఆర్‌కి బదులుగా ఈ కారునే కొంటున్నారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News