ఆమె ఓ అంతర్జాతీయ క్రికెటర్.. క్రీజులో దిగి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అలాంటి మహిళ.. ప్రపంచ మహిళా టీ-20 సందర్భంగా .. టీమ్ ఇండియాకు తన మద్ధతు తెలిపింది. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు.. అవకాశం వస్తే .. మెరుపులు కురిపిస్తారని చాటి చెప్పింది. ఆమె ఎవరో కాదు.. హైదరాబాద్ మేటి వుమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్.
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఇంగ్లండ్ తో తలపడింది. ఐతేవర్షం కారణంగా భారత్ నేరుగా ఫైనల్ చేరుకుంది. ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రేరణ అందిస్తూ మిథాలీ రాజ్ చేసిన వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వీడియో చేసినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో మహిళా క్రికెట్ ను ప్రోత్సహించేందుకు ఆమె చీరలో క్రికెట్ ఆడుతున్న వీడియో.. ట్విట్టర్ లో ఎక్కువగా వైరల్ అవుతోంది.
Read Also: 'కరోనా వైరస్'పై ఫన్నీ వీడియోలు
మిథాలీ రాజ్.. 37 ఏళ్ల ఈ హైదరాబాదీ క్రికెటర్.. టీ-20 నుంచి గతేడాది రిటైర్మెంట్ తీసుకుంది. కానీ ఆమె చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో భారత మహిళల టీమ్ తో పాటు ఆమె మల్లీ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన మిథాలీ. . టీ 20 వరల్డ్ కప్ ను భారత్ కు తీసుకురావాలని కోరింది.