N Jagadeesan Shows Middle Finger After Mankaded by Baba Aparajith: తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 2022 గురువారం రాత్రి తిరునల్వేలి వేదికగా ఆరంభం అయింది. టీఎన్‌పీఎల్ 2022 మొదటి మ్యాచులో చెపాక్ సూపర్ గిల్లీస్, నెలాయి రాయల్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇండియన్ సిమెంట్ కంపెనీ మైదానంలో జరిగిన ఈ టీ20 మ్యాచ్ ఉత్కంఠగా ముగిసింది. సూపర్ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచులో నెలాయి రాయల్ కింగ్స్ విజయం సాధించింది. మరో బంతి ఉండగానే చెపాక్ నిర్ధేశించిన 10 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచులో మన్కడింగ్ మరోసారి దుమారం రేపింది.
ఈ మ్యాచులో చెపాక్ సూపర్ కింగ్స్ వికెట్ కీపర్, ఓపెనర్ నారాయణ్ జగదీశన్ మన్కడింగ్ విధానంలో ఔట్ అవ్వడం టీఎన్‌పీఎల్ 2022లో దుమారం రేపింది. విషయంలోకి వెళితే.. నెలాయి రాయల్ కింగ్స్ నిర్ధేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చెపాక్ సూపర్ గిల్లీస్ బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌ను బాబా అపరాజిత్ వేస్తున్నాడు. ఆ సమయంలో కౌశిక్ గాంధీ స్ట్రైకింగ్ చేస్తుండగా.. నారాయణ్ జగదీశన్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. నాలుగో బంతిని అపరాజిత్ వేయకముందే జగదీశన్ క్రీజును వీడాడు. దీంతో అపరాజిత్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోని వికెట్లను పడగొట్టాడు. ఇంకేముయింది జగదీశన్ మన్కడింగ్ రూపంలో రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఔట్ అయ్యే సమయానికి ఎన్ జగదీశన్ మంచి జోరు మీద ఉన్నాడు. 15 బంతుల్లో 25 పరుగులు బాదాడు. ప్రమాదకరంగా మారుతున్న అతడిని పెవిలియన్ పంపించేందుకు బాబా అపరాజిత్ మన్కడింగ్ విధానాన్ని ఎంచుకున్నాడు. దాంతో తీవ్ర నిరాశకు లోనైన జగదీశన్ అసభ్యకర సంజ్ఞ (మిడిల్ ఫింగర్) చేస్తూ మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు జగదీశన్‌పై మండిపడుతున్నారు. 'నీకు క్రికెట్ నిబంధనలు తెలియవా?' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఆటగాళ్ల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది' అని ఇంకొకరు ట్వీట్ చేశాడు.
🤐🤐🤐🤐 @Jagadeesan_200 @aparajithbaba senior players of tn🤐🤐🤐 pic.twitter.com/C9orMqRPL3
— Jayaselvaa ᅠ (@jayaselvaa1) June 23, 2022
ఐపీఎల్ టోర్నీలో రవిచంద్రన్ అశ్విన్ ముందుగా మన్కడింగ్ ద్వారా జోస్ బట్లర్‌ను ఔట్ చేయడం పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదు. ఎంసీసీ చేసిన సవరణలను ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా అమోదించింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమల్లోకి రానుంది.
Also Read: Henry Nicholls Out: దేవుడా.. ఇలా కూడా ఔట్ అవుతారా! వీడియో చూస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు
Also Read: Toothache Home Remedies: పంటి నొప్పులతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.