Liger Prime Video: భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్.. పుష్ప కంటే డబుల్!!

Liger Prime Video: విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులకు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' 60 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 12:00 PM IST
  • భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్
  • పుష్ప కంటే డబుల్ బిజినెస్
  • ఆగస్టు 25న లైగర్ రిలీజ్
Liger Prime Video: భారీ మొత్తానికి అమ్ముడైన 'లైగర్' నాన్ థియేట్రికల్ రైట్స్.. పుష్ప కంటే డబుల్!!

Liger Movie Theatrical Digital Streaming Rights sold by Amazon Prime: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ న్యూస్ తెలిసింది. 

'లైగర్' సినిమా డిజిటల్ రైట్స్ కళ్లు చెదిరే రేంజ్‌కు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులకు 60 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అన్ని భాషల ఓటీటీ హక్కుల కోసం రూ. 80 కోట్లు + GST ​​అడిగారట చిత్ర బృందం. ఈ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. 60 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఒప్పందం కుదిరాక అధికారిక ప్రకటన రానుంది. 

ఏదేమైనా 'లైగర్' డిజిటల్ హక్కుల బిజినెస్ ఇటీవల బంపర్ హిట్ కొట్టిన 'పుష్ప' సినిమాకు డబుల్ అనే చెప్పాలి. పుష్ప డిజిటల్ హక్కులను అమెజాన్ రూ.30 కోట్లు వెచ్చింది సొంతం చేసుకుంది. కేవలం ఓటీటీ ద్వారానే లైగర్ సినిమా ఈ స్థాయిలో ఆఫర్‌ను అందుకుంది అంటే.. ఇంకా శాటిలైట్ రైట్స్ ద్వారా ఏ స్థాయిలో లాభాలు అందుకుంటుందో ఊహించడం కాస్త కష్టమే. మొత్తానికి లైగర్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్‌కి అమ్ముడుపోవడం మాత్రం ఖాయం.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న లైగర్ చిత్రంను పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వెనకపడ్డ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. అనన్య పాండేకి తెలుగులో ఇది మొదటి సినిమా కాగా.. విజయ్ దేవరకొండకి ఇది బాలీవుడ్ డెబ్యూ సినిమా. ఆగస్టు 25 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మరోసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన' అనే సినిమాతో బిజీ కానున్నాడు.

Also Read: Sampreeti Yadav: 24 ఏళ్లకే 50 ఇంటర్వ్యూలు.. చివరికి గూగుల్‌లో కోటి రూపాయల ఉద్యోగం!!

Also Read: Khiladi Movie Liplock: హీరోలతో లిప్ లాక్ చేసేందుకు నాకు నో ప్రాబ్లమ్: 'ఖిలాడి' హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News