RCB vs RR Playing 11: టాస్ గెలిచిన రాజస్థాన్.. కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ

Royal Challengers Bangalore vs Rajasthan Royals Playing 11 and Dream11 Team: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఆదివారం తలపడుతున్నాయి. విరాట్‌ కోహ్లీ ఆర్‌సీబీకి నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 23, 2023, 03:48 PM IST
RCB vs RR Playing 11: టాస్ గెలిచిన రాజస్థాన్.. కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లీ

Royal Challengers Bangalore vs Rajasthan Royals Playing 11 and Dream11 Team: ఐపీఎల్‌ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగుళూరు తలపడుతోంది. పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉన్న రాజస్థాన్‌.. ఆరోస్థానంలో ఉన్న ఆర్‌సీబీ మధ్య బిగ్‌ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆర్‌సీబీ బౌలింగ్‌లో తేలిపోయింది. ఈ మ్యాచ్‌కు బౌలింగ్‌లో పుంజుకోవాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ ఈ మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌ మాత్రమే చేయనున్నాడు. విరాట్ కోహ్లీ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సొంతగడ్డపై బెంగుళూరు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఆర్‌సీబీ ఆటగాళ్లు ఎరుపు రంగు జెర్సీకి బదులుగా గ్రీన్ జెర్సీని ధరించి మ్యాచ్ ఆడనున్నారు. పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సీజన్‌లో ఒకసారి ఇలా గ్రీన్‌ జెర్సీలో మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. పార్నెల్ స్థానంలో డేవిడ్ విల్లీని తుది జట్టులోకి తీసుకుంది ఆర్‌సీబీ.

గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే లక్ష్యంతో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. జోస్ బట్లర్ ఈ సీజన్‌లో కూడా అదరగొడుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 40.67 సగటుతో 244 పరుగులు చేశాడు. ఇటు ఆర్‌సీబీ ఆరు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలుపింది.. మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 6 మ్యాచ్‌ల్లో 55.80 సగటుతో 279 రన్స్ చేశాడు. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 27 మ్యాచ్‌లు జరగ్గా.. ఆర్‌సీబీ 13 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. మరోసారి ఉత్కంఠభరితంగా పోరు జరిగే అవకాశం ఉంది.
 

 

 

Also Read: Arjun Tendulkar IPL: అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్లో 31 పరుగులు

తుది జట్లు ఇలా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైశాక్ 

రాజస్థాన్ రాయల్స్:  జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

Also Read: Arshdeep Singh Bowling: ఇదేక్కడి బౌలింగ్ సింగ్ మావా.. రెండుసార్లు స్టంప్‌లు విరగొట్టిన అర్ష్‌దీప్.. వాటి ధర ఎంతో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News