Anrich Nortje left Delhi Capitals before DC vs RCB Match Today in Delhi: ఐపీఎల్ 2023 ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జ్ వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా శుక్రవారం అర్థరాత్రి దక్షిణాఫ్రికాకు బయలుదేరాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్‌కు నోర్జ్ అందుబాటులో ఉండడు అని ఢిల్లీ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.
అన్రిచ్ నోర్జ్ స్థానంలో ఎవరిని రీప్లేస్ చేయాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ కోసం అందుబాటులో ఉన్న బౌలర్లతోనే బరిలోకి దిగనున్నట్లు పేర్కొంది. ఈ మ్యాచ్ తర్వాత అన్రిచ్ నోర్జ్ స్థానాన్ని భర్తీ చేస్తామని తెలిపింది. అత్యవసర కారణాలతో నోర్జ్ జట్టుకు అందుబాటులో ఉండలేడని, ఎలాంటి అవసరం వచ్చినా అతడికి అండగా ఉంటామని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చెప్పుకొచ్చింది.
అన్రిచ్ నోర్జ్ 16వ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ 2/20. ఈ సేనలో అతడి ఎకానమి 8.24గా ఉంది. మొత్తంగా ఐపీఎల్‌లో 38 మ్యాచ్‌లల్లో అన్రిచ్ నోర్జ్ 50 వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్.. 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తీసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ఫాస్టెస్ట్ డెలివరీ (156.2) నాలుగో రికార్డు దక్షిణాఫ్రికా పేసర్ అయిన అన్రిచ్ నోర్జ్ పేరుపై ఉంది.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది కేవలం మూడే. 6 మ్యాచ్‌లల్లో ఘోర పరాజయాలను చవి చూసింది. ఇందులో వరుసగా ఐదు ఓటములను ఎదుర్కొంది. ఇటీవలే ఢిల్లీ విజయాల బాట పట్టింది. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన ఐదు మ్యాచులలో కచ్చితంగా గెలవాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: DC vs RCB: సెంచరీ చేసి సౌరవ్ గంగూలీకి అంకితం ఇవ్వు.. విరాట్ కోహ్లీకి శ్రీశాంత్ సూచన!
Also Read: Toyota Hyryder Price Hike 2023: 60 వేలు పెరిగిన టయోటా హైరైడర్ ధర.. కొత్త ధరల జాబితా ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.