Gujarat Titans Vs Delhi Capitals Match Updates: పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్.. ఆఖరిస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో 6 గెలిచి మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 ఓడి ఆఖరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే గుజరాత్ ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ అవ్వనుండగా.. ఢిల్లీ ఓడిపోతే ప్లేఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఎలాగైనా గుజరాత్‌ను ఓడించాలనే పట్టుదలతో ఢిల్లీ బరిలోకి దిగుతోంది.
మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు జట్లు సమరానికి రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ రెండు మార్పులతో బరిలోకి దిగుతుండగా.. గుజరాత్ తుది జట్టులో మార్పులు ఏమి చేయలేదు. గాయం నుంచి కోలుకుని ఖలీల్ అహ్మద్ ఎంట్రీ ఇవ్వగా.. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. రిలీ రోసోవ్ జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్ గుజరాత్ కంటే ఢిల్లీకే ఎక్కువగా ఇంపార్టెంట్‌గా మారింది. 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే ఢిల్లీ ఖాతాలో ఉన్నాయి. మిగిలిన 6 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే పటిష్ట గుజరాత్‌ను ఓడించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఢిల్లీ జట్టు బౌలింగ్ విభాగంలో పుంజుకుంటున్నా.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతోంది. ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించడంలేదు. డేవిడ్ వార్నర్ మళ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ జట్టుకు దూరం అవ్వడం ఢిల్లీ దెబ్బగా మారింది.
మరోవైపు గుజరాత్ సొంతగడ్డపై అన్ని విభాగాల్లో బలంగా ఉంది. హ్యాట్రిక్ విజయాలు సాధించి మళ్లీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. జట్టులో అందరూ బ్యాట్స్‌మెన్లు అవసరానికి తగినట్లు ఆడుతుండడం శుభపరిణామం. వృద్ధిమాన్ సాహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా టచ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది. మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోస్ లిటిల్, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్‌లో చక్కగా రాణిస్తుండగా.. స్పిన్ ద్వయం రషీద్, నూర్ అహ్మద్ వికెట్లు తీయడంలో పోటీపడుతున్నారు.
తుది జట్లు ఇలా..
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, నోకియా, ఇషాంత్ శర్మ
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్
Also Read: YS Sharmila: బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్పిన వైఎస్ షర్మిల.. మొత్తం ఎన్ని కోట్లంటే..?
Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం.. షాకిచ్చిన బీసీసీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి