DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి

Mumbai Indians Won by 6 Wickets Vs DC: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తొలి విక్టరీ దక్కింది. చివరివరకు పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్.. వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఆఖరి ఓవర్లో హైడ్రామా నడుమ ముంబై విజయాన్ని అందుకుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 01:19 AM IST
DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి

Mumbai Indians Won by 6 Wickets Vs DC: ఉత్కంఠభరిత ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుని ఈ సీజన్‌లో తొలి గెలుపును నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. అనంతరం ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా నెలకొనగా.. ఢిల్లీ ఫీల్డర్ చేజేతులా మ్యాచ్‌ను ముంబైకి అప్పగించారు. ఓ క్యాచ్‌ డ్రాప్ చేయడంతోపాటు.. బాల్ సరిగా త్రో వేయకపోవడంతో విజయం ముంబైని వరించింది. ఈ మ్యాచ్‌ ద్వారా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (65) ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు.  

ఢిల్లీ జట్టు విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఆదిలో చాలా బాగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వరుసగా బెట్టి బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరు 7.3 ఓవర్లలోనే 71 జోడించి గట్టి పునాది వేశారు. ఇషన్ కిషన్‌ (31) రనౌట్ రూపంలో ఔట్ అవ్వడంతో ఢిల్లీ తొలి వికెట్ సంపాదించింది. ఆ తరువాత రోహిత్ శర్మకు వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్ వర్మ తోడవ్వడంతో పరుగుల వేగం మరింత పెరిగింది. అవతలి ఎండ్‌లో రోహిత్ శర్మ యాంకర్ రోల్ ప్లే చేయగా.. తిలక్ వర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. 15.5 ఓవర్లలో 139 పరుగుల వద్ద తిలక్ వర్మ (29 బంతుల్లో 41, ఒక ఫోర్, 4 సిక్సర్లు) ఔట్ అయ్యాడు.

ఆ తరువాత బంతికే సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అవ్వగా.. కాసేపటికే రోహిత్ శర్మ (45 బంతుల్లో 65, 6 ఫోర్లు 4 సిక్సర్లు)ను ఔట్ చేసి ఢిల్లీ రేసులోకి వచ్చింది. ముంబయి విజయానికి చివరి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమైన దశలో టిమ్ డేవిడ్, కెమెరూన్ గ్రీన్ జాగ్రత్తగా ఆడారు. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్‌లో తలో సిక్సర్ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు కావాల్సి ఉండగా.. నోకియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మొదటి బాల్‌కు సింగిల్ రాగా.. తరువాత రెండు బాల్స్ డాట్ అయ్యాయి. దీంతో సమీకరణ మూడు బంతుల్లో నాలుగుగా మారింది. నాలుగు, ఐదు బంతులకు సింగిల్స్ రాగా.. ఆఖరి బంతికి టిమ్ మిడాఫ్ దిశగా కొట్టి రెండు పరుగులు రాబట్టడంతో ముంబై విజయం సాధించింది. ఢిల్లీ కీపర్ అభిషేక్ రనౌట్ కోసం ప్రయత్నించగా.. రిప్లైలో నాటౌట్‌ అని తేలింది. 

Also Read: Corona Vaccine: గుడ్‌న్యూస్.. అన్ని వేరియంట్లకు ఒక్కటే బూస్టర్ డోస్.. కోవిన్ యాప్‌లో అందుబాటులోకి..!  

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి సరైన ఆరంభం దక్కలేదు. పృథ్వీ షా (15) చెత్త ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. మనీష్ పాండే (26, 18 బంతుల్లో 5 ఫోర్లు) కాస్త పర్వాలేదనిపించగా.. యాష్‌ ధుల్ (2), రోవ్‌మన్ పావెల్ (4), లలిత్ యాదవ్ (2) దారుణంగా విఫలయ్యారు. అవతలి ఎండ్‌లో పాతుకుపోయిన డేవిడ్ వార్నర్‌కు అక్షర్ పటేల్ జత కలిశాడు. వార్నర్ ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితం అవ్వగా.. అక్షర్ పటేల్ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. అక్షర్ పటేల్ (54, 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (51, 47 బంతుల్లో ఆరు ఫోర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. వీరిద్దరు ఔట్ అయిన తరువాత ముంబై బౌలర్లు చకచకా వికెట్లు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో బెహండ్రాఫ్, పీయష్ చావ్లా చెరో వికెట్లు తీయగా.. మెరాడిత్ 2, హృతిక్ ఒక వికెట్ పడగొట్టాడు. 

Also Read: Karnataka Elections: రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు.. ఎన్నికల్లో మాజీ సీఎం విచిత్ర హామీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News