CSK vs GT IPL 2023 Final: గుజరాత్‌తో ఫైనల్.. చెన్నైకి శుభ సూచికం! టైటిల్ ఇక ధోనీ సేనదే

Is Non Sunday Finals sentiment Works for CSK. ఫైనల్ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లడం చెన్నైకి శుభ సూచకమనే చెప్పాలి. వర్షం పడడం చెన్నై గెలుపు కోసమే అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.  

Written by - P Sampath Kumar | Last Updated : May 29, 2023, 04:04 PM IST
CSK vs GT IPL 2023 Final: గుజరాత్‌తో ఫైనల్.. చెన్నైకి శుభ సూచికం! టైటిల్ ఇక ధోనీ సేనదే

Is Non Sunday Finals sentiment Works for CSK: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలో మొదటిసారి వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రిజర్వ్‌ డే వరకు వెళ్లింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ , గుజరాత్ టైటాన్స్‌ జట్ల మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగాల్సి ఉండగా.. భారీ వర్షం పడింది. వర్షం వల్ల ఫైనల్ మ్యాచ్ సోమవారంకు మ్యాచ్‌ వాయిదా పడింది. నేటి రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని గుజరాత్ భావిస్తుండగా.. ముంబైతో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని చెన్నై చూస్తోంది. అయితే రిజర్వ్‌ డే రోజున జరిగే మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. 

ఫైనల్ మ్యాచ్‌ రిజర్వ్‌ డేకు వెళ్లడం చెన్నైకి శుభ సూచకమనే చెప్పాలి. ఇప్పటివరకు 15 ఐపీఎల్‌ సీజన్లలో 12 ఫైనల్ మ్యాచ్‌లు ఆదివారం జరిగాయి. ఐపీఎల్ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ కూడా ఆదివారం షెడ్యూల్‌ అయినప్పటికీ.. వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. నాన్‌ సండే రోజు జరిగిన మూడు ఫైనల్స్‌లో చెన్నై రెండు సార్లు విజయం సాధించింది. 2011లో బెంగళూరుతో శనివారం రోజున ఫైనల్లో చెన్నై గెలవగా.. 2021లో శుక్రవారం నాడు కోల్‌కతాతో జరిగిన ఫైనల్లో ధోనీ సేన గెలిచింది. 2020లో మంగళవారం రోజున డీసీతో జరిగిన ఫైనల్లో ముంబై గెలుపొందింది. మూడింట రెండు ఫైనల్స్‌ సీఎస్‌కే గెలవడంతో.. చెన్నై అభిమానులు నాన్‌ సండే రోజు ఐపీఎల్‌ 2023 ఫైనల్ జరగడం శుభ సూచకంగా భావిస్తున్నారు. 

సెంటిమెంట్లు బలంగా నమ్మే చెన్నై అభిమానులకు నాన్‌ సండే ఫైనల్ మ్యాచ్ యమ కిక్కువ్వనుంది. నేడు జరగనున్న ఐపీఎల్ 2023 ఫైనల్లో చెన్నై తప్పక టైటిల్‌ గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఆదివారం వర్షం పడడం చెన్నై గెలుపు కోసమే అని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ చెన్నైకి కలిసొస్తుందో లేదో చూడాలి. ఇక ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల కోసం సెలవు దినమైన ఆదివారం రోజు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఐపీఎల్‌ ఫైనల్స్‌ నాన్‌ సండే రోజు నిర్వహిస్తారు.  

వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 మ్యాచ్‌కు నేడు కూడా వరుణుడి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే చెన్నైకి నిరాశే మిగులుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే విజేతగా గుజరాత్ టైటాన్స్‌ కప్‌ను కైవసం చేసుకుంటుంది. లీగ్ స్టేజ్‌లో అత్యధిక పాయింట్స్ ఉన్న జట్టు విజేతగా నిర్ణయిస్తారు. లీగ్ దశలో గుజరాత్ 10 విజయాలతో 20 పాయింట్లు సాధించగా. చెన్నై 8 విజయాలతో 17 పాయింట్లు ఖాతాలో వేడుకుంది. వరుణుడు ఏం చేస్తాడో చూడాలి.

Also Read: Hardik Pandya-MS Dhoni: ఎంఎస్ ధోనీని హార్దిక్ పాండ్యా గుర్తు చేస్తున్నాడు: సునీల్ గవాస్కర్   

Also Read: Aadhaar Card Update: జూన్ 14వ వరకు ఫ్రీ సర్వీస్.. ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.

Trending News