IPL 2022, KKR vs GT: ఉత్కంఠ పోరులో కోల్​కతాపై​ గుజరాత్​ విజయం..అగ్రస్థానంలోకి హార్దిక్‌ సేన

KKR vs GT: ఐపీఎల్​ 15వ సీజన్​లో గుజరాత్​ టైటాన్స్​ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో 8 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 08:48 PM IST
  • ఉత్కంఠగా సాగిన కేకేఆర్, గుజరాత్ మ్యాచ్
  • చివర్లో చతికిలపడ్డ కోల్​కతా
  • అగ్రస్థానంలోకి పాండ్యా సేన
IPL 2022, KKR vs GT: ఉత్కంఠ పోరులో కోల్​కతాపై​ గుజరాత్​  విజయం..అగ్రస్థానంలోకి హార్దిక్‌ సేన

IPL 2022 GT Vs KKR: ఉత్కంఠపోరులో చివరికి విజయం గుజరాత్ నే  (Gujarat Titans) వరించింది. కోల్​కతాను (Kolkata Knight Riders) 8 పరుగుల తేడాతో ఓడించి.. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. హార్ధిక్ సేన విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని కోల్​కతా ఛేదించలేక 148 పరుగులకే పరిమితమైంది. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్, షమీ, యశ్‌ దయాల్ లు రెండేసి వికెట్లు తీశారు. 

హార్దిక్‌ కెప్టెన్ ఇన్నింగ్స్
గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టు ఆదిలోనే  ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (7) వికెట్ ను కోల్పోయింది. తర్వాత హార్దిక్‌ పాండ్య, వృద్ధిమాన్‌ సాహా ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ముఖ్యంగా పాండ్య తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. వృద్ధిమాన్​ సాహా 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం పాండ్యాకు జతకలిసిన మిల్లర్ దూకుడు పెంచాడు. పాండ్యా 49 బంతుల్లో 67 పరుగులు, మిల్లర్ 20 బంతుల్లో 27 పరుగులు చేసి స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. తర్వాత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఆండ్రీ రస్సెల్ మ్యాజిక్ చేశాడు. కేవలం 6 బంతుల్లో 5 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి.. సరికొత్త రికార్డు సృష్టించాడు.

రఫ్పాడించిన రస్సెల్ 
లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కోల్‌కతాకు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సామ్‌ బిల్లింగ్స్‌ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు.  మరో ఓపెనర్ నితీశ్ రాణా(2) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. కోల్‌కతా బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 41 పరుగులు మాత్రమే  చేసింది. వెంకటేశ్‌ అయ్యర్, రింకు సింగ్ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. గుజరాత్ బౌలర్లు స్వల్ప వ్యవధిలో వికెట్లు తీయడంలో కోల్‌కతా కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన  ఆండ్రూ రస్సెల్ (Andre Russell) తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. దీంతో కోల్‌కతా విజయానికి చివరి ఓవర్లో 18 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే  సిక్స్‌ కొట్టి న ఆండ్రూ రస్సెల్ (48).. తర్వాత బంతికి వెనుదిరిగాడు. మిగతా నాలుగు బంతుల్లో కోల్‌కతా కేవలం మూడు పరుగులే చేసింది. దీంతో విజయం గుజరాత్ ను వరించింది. 

Also Read: Wankhade Stadium: వాంఖడే స్డేడియంలో ఛీటర్..ఛీటర్ నినాదాలు, పంత్ అసహనం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News