Ind vs Eng 2nd T20 Match: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇవాళ సాయంత్రం రెండవ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ విజయంతో 1-0 ఆధిక్యంతో ఉన్న ఇండియా రెండో మ్యాచ్ విజయం కోసం ప్రయత్నిస్తుంటే ఆధిక్యం నిలువరించేందుకు ఇంగ్లండ్ సిద్ధమౌతోంది.రెండు జట్లలోనూ కొన్ని మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.
తీవ్రమైన గాయం కారణంగా ఇప్పటి వరకూ ఆటకు దూరమైన టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు. ఇవాళ్టి మ్యాచ్ ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లేదా రింకూ సింగ్‌లో ఒకరు మొహమ్మద్ షమి కోసం తప్పుకోవాల్సి వస్తుంది. తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌తో పాటు మూడో స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడవచ్చు. చెన్నై పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలమైనందున స్పిన్నర్లకే ఎక్కువ అవకాశముంటుంది. ఇక పేస్ విషయానికొస్తే అర్షదీప్‌కు మొహమ్మద్ షమి తోడుకానున్నాడు. బ్యాటింగ్ విషయంలో ఇండియాకు ఢోకా లేదు. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే తొలి మ్యాచ్ ఓడిపోవడంతో పట్టు కోసం ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ప్రపంచస్థాయి ఆటగాళ్తతో రెండో మ్యాచ్ విజయం కోసం సిద్ధమైంది. ఓపెనర్లు సాల్ట్, డకెట్ విరుచుకుపడవచ్చు. బ్రూక్, లివింగ్‌స్టన్ ప్రమాదకర ఆటను కనబర్చవచ్చు. అర్చర్, మార్క్‌వుడ్, అట్కిన్సన్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది.
చెన్నై పిచ్ ఎలా ఉంటుంది
చెన్నై పిచ్ స్పిన్నర్లకే అనుకూలం. ఈ మ్యాచ్ వికెట్ కూడా అలానే ఉండనుంది. పిచ్ కొద్దిగా స్లో ఉంటుంది. ఐపీఎల్‌లో ఈ పిచ్‌పై ఎప్పుడు 160కు పైగా పరుగులు నమోదవుతుంటాయి. రెండో బ్యాటింగ్ అనుకూలించవచ్చు. అందుకే టాస్ కీలకం కానుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 25 టీ20లు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా 14 గెలవగా ఇంగ్లండ్ 11 గెలిచింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 2 అంతర్జాతీయ టీ20లు జరిగాయి. ఒకటి ఇండియా గెలిస్తే మరొకటి న్యూజిలాండ్ గెలిచింది. ఈ పిచ్‌పై ఇండియా చివరిసారిగా వెస్టిండీస్‌తో 2018లో తలపడి 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే రెండవ టీ20 మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ , హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి