India vs England: టీ20 సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ, గాయం నుంచి కోలుకోని పేసర్ Jofra Archer

England Pacer Jofra Archer | టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోలేదు. రిజర్వ్ బెంచ్‌తో పటిష్టంగా కనిపిస్తోంది భారత్.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 8, 2021, 03:18 PM IST
  • టీమిండియా చేతిలో 3-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు
  • త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్‌లోకి
  • ఇంగ్లాండ్‌కు టీ20 సిరీస్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది
India vs England: టీ20 సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ జట్టుకు ఎదురుదెబ్బ, గాయం నుంచి కోలుకోని పేసర్ Jofra Archer

India vs England: Pacer Jofra Archers availability in T20I series: టీమిండియా చేతిలో 3-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుతో త్వరలో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఓ వైపు భారత్ ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. రిజర్వ్ బెంచ్ సైతం పటిష్టంగా ఉండటంతో మరికొందరు యువ ఆటగాళ్లకు అవకాశాలు రావడం లేదు. కానీ  ఇంగ్లాండ్ పరిస్థితి మరోలా ఉంది. అసలే టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు టీ20 సిరీస్‌కు ముందే ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.

నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు దూరమైన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 5 టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. మోచేతి గాయం, నొప్పి కారణంగా చివరిటెస్టుకు దూరమైన జోఫ్రా ఆర్చర్ ఇంకా కోలుకోలేదని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ తెలిపాడు. మెడికల్ స్టాఫ్ జోఫ్రా ఆర్చర్‌ను టీమిండియా(Team India)తో టీ20 సిరీస్‌కు సిద్ధం చేసేందుకు యత్నిస్తున్నారని సైతం వెల్లడించాడు.

Also Read: IPL 2021 Schedule: ఐపీఎల్ 2021 పూర్తి షెడ్యూల్, వేదికల వివరాలు విడుదల చేసిన BCCI

మోచేతి సమస్య నుంచి కోలుకోకుండానే టీమిండియాతో టీ20 సిరీస్‌కు జోఫ్రా ఆర్చర్ బరిలోకి దింపుతారా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికి జోఫ్రా ఆర్చర్ ఫిట్‌గా లేడు. శుక్రవారం నుంచి టీమిండియా, ఇంగ్లాండ్(England) మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇటీవల రెండో టెస్టు మ్యాచ్‌కు సైతం ఎల్బో సమస్యతో పేసర్ ఆర్చర్ దూరమయ్యాడు. అవసరమైతే బ్యాట్ సైతం ఝులిపించగల ఆటగాడు కావడంతో పేసర్ జోఫ్రా ఆర్చర్ పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Also Read: IPL 2021 MI Schedule: ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్

కాగా, ఇంగ్లాండ్‌పై మూడు టెస్టుల్లో విజయం సాధించి ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విరాట్ కోహ్లీ సైన ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది. అదే సమయంలో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ చేతిలో వరుసగా 3 టెస్టులు ఓడిన ఇంగ్లాండ్ 4వ స్థానానికి పడిపోయింది.

Also Read: Womens Day 2021 Wishes: నారీమణులకు వుమెన్స్ డే విషెస్ ఇలా తెలపండి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News