IND vs ENG 2nd Test Updates: ముగిసిన తొలి రోజు ఆట... డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి..

India vs England Live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా ఆరు వికెట్లు నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 07:22 PM IST
IND vs ENG 2nd Test Updates: ముగిసిన తొలి రోజు ఆట... డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి..

IND vs ENG 2nd Test Day 01 highlights: వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. అయితే చివరలో ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీశారు. దీంతో భారత్ మెుదటి రోజు ఆట ముగిసే సమయానికి 6  వికెట్లు కోల్పోయి 336  పరుగులు చేసింది. టీమిండియా విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ భారీ శతకంతో చెలరేగాడు. ఇతడు 257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు సహాయంతో 179 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్, యశస్వి శుభారంభం అందించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కొత్త బౌలర్ బషీర్‌ విడదీశాడు. 14 పరుగులు చేసిన రోహిత్ ను ఇతడు ఔట్ చేశాడు. రోహిత్ స్థానంలో వచ్చిన గిల్‌ ధాటిగా ఆడాడు. అయితే 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడిని వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ ఔట్ చేశాడు. లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. అప్పటికే జైస్వాల్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

చెలరేగిన జైస్వాల్..
గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో జతకలిసిన జైస్వాల్‌.. మూడో వికెట్‌కు 90 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. అనంతరం శ్రేయస్ ను టామ్‌ హర్ట్లీ ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. సిక్సర్ తో ఇతడు శతకం సాధించాడు. టెస్టుల్లో జైస్వాల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. సొంతగడ్డపై తొలి శతకం. అయ్యర్ ఔటైనా తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 70 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు.  లోకల్ బాయ్ శ్రీకర్‌ భరత్‌ (23 బంతుల్లో 17, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ధాటిగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. ప్రస్తుతం జైస్వాల్, అశ్విన్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లీష్‌ బౌలర్లలో అహ్మద్‌, బషీర్‌ లు చెరో రెండు వికెట్లు తీశారు. 

Also Read: Ravichandran Ashwin: రేపటి నుంచే రెండో టెస్టు.. పలు రికార్డులపై కన్నేసిన అశ్విన్..

Also Read: Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News