IND vs WI 2nd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్ ఆయేగా! ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం!!

IND vs WI 2nd ODI Toss: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం అయింది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2022, 02:01 PM IST
  • భారత్ vs వెస్టిండీస్‌ రెండో వన్డే
  • రాహుల్ ఇన్.. యువ ఓపెనర్‌కు నిరాశే
  • ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం
IND vs WI 2nd ODI: టీమిండియాదే బ్యాటింగ్.. రాహుల్ ఆయేగా! ఓపెనర్‌గా టీమిండియా కొత్త ప్రయోగం!!

Rishabh Pant comes as a opener in place of KL Rahul: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం అయింది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ మ్యాచ్ ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో అతడి స్థానంలో పూరన్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. పోలార్డ్ బదులుగా ఓడియన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు.

సోదరి వివాహం కారణంగా తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండో వన్డే ఆడుతున్నాడు. దాంతో మొదటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా ఓపెనర్‌ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను బరిలోకి దింపింది. ఇది అందరికి ఆశ్చర్యానికి గురిచేసినా.. కొత్త ప్రయోగం ఫలిస్తే మాత్రం మరో ఓపెనర్ దొరికినట్టే. ఓపెనర్‌గా వచ్చిన పంత్ 9 బంతుల్లో 2 పరుగులు చేశాడు. 

నయా కెప్టెన్‌ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన చారిత్రక 1000 వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇదే జరిగితే మొదటి సిరీసులోనే రోహిత్ ట్రోఫీని ఖాతాలో వేసుకుంటాడు. మరోవైపు తొలి వన్డేలో ఓడిన వెస్టిండీస్ జట్టు.. రెండో వన్డేలో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.  

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌,  శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ. 

వెస్టిండీస్‌: షాయీ హోప్‌, బ్రాండన్‌ కింగ్‌, డారెన్‌ బ్రావో, షామా బ్రూక్స్‌, నికోలస్‌ పూరన్‌ (కెప్టెన్‌), జేసన్‌ హోల్డర్‌, ఓడియన్ స్మిత్‌, అకీల్‌ హొసేన్‌, ఫాబియన్‌ అలెన్‌, అల్జారీ జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌. 

Also Read: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్‌.. యాక్సిడెంట్‌లో యువకుడిని కాపాడిన రియల్‌ హీరో!! (వీడియో)

Also Raed: Viral Photo: పుష్ప రాజ్‌గా టీమిండియా స్టార్ ప్లేయర్స్.. ఎవరు బాగా సెట్ అయ్యారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News